వాస్తు: విజయవంతమైన వైవాహిక జీవితానికి తెలుసుకోవాల్సిన వాస్తు సత్యాలు..

-

పెళ్ళికి వాస్తు ( Vasthu ) కి సంబంధం ఏమిటని ఆలోచిస్తున్నారా? ఉంది. కానీ ప్రత్యక్షంగా పెళ్ళిపై వాస్తుకి ఎలాంటి సంబంధం లేనప్పటికీ, పెళ్ళయ్యాక ఒకే ఇంట్లో కలిసి ఉండాలి కాబట్టి, ఇంటి వాస్తు అనేది పరిగణలోకి వస్తుంది. కొత్తగా పెళ్ళయిన జంట మధ్య చిన్న చిన్న పొరపొచ్చాలు సహజం. అలాంటి అల్లర్లు కొన్ని బాగానే ఉంటాయి. ఒక్కోసారి అలాంటి పొరపాట్లకి వాస్తు కూడా కారణంగా నిలుస్తుందని నిపుణుల అభిప్రాయం. మరి విజయవంతమైన వైవాహిక జీవితాన్ని కొనసాగించడానికి వాస్తు శాస్త్రం ఏం చెబుతుందో చూద్దాం.

Vasthu For Marriage Life | వాస్తు

 

పడక గది

ఈశాన్యానికి ముఖం చేసి పడుకోవద్దు. దానివల్ల మీ భాగస్వామికి, మీకూ మధ్య గొడలు జరిగే అవకాశం ఉంది. ఎప్పుడైనా ఈశాన్యానికి ముఖం పెట్టి పడుకోవద్దు.

కిచెన్

ఉత్తరం దిక్కుకు ముఖం చేసి అన్నం వండరాదని వాస్తు నిపుణులు సూచిస్తున్నారు. అలా చేయడం అస్సలు మంచిది కాదని, అందువల్ల కిచెన్ ఫ్లాట్ ఫామ్ ఎటువైపు ఉంచుకోవాలనేది ముందుగానే ప్లాన్ చేసుకోవాలని చెబుతున్నారు.

మొక్కలు

ఇంట్లో పెంచుకునే చిన్న చిన్న మొక్కల గురించి తెలుసుకోండి. బోన్ సాయి మొక్కల వైపు వెళ్ళకపోవడమే మంచిది.

రంగులు

పడకగది గోడలకు చిక్కనైన(డార్క్) రంగులు వేయకుండా చూసుకోండి. అది మీ వైవాహిక జీవితంపై ప్రతికూల ప్రభావం చూపే అవకాశం ఉంది.

ప్రతిబింబాలు

పడకగదిలో అద్దం ఉంచకపోవడమే ఉత్తమం. దానివల్ల ప్రతికూల శక్తులు ప్రవేశించే అవకాశం ఉందని భావన.

బెడ్ ఆకారం

గుండ్రంగా ఉండే బెడ్ ఎంచుకోకపోవడమే కరెక్టని వాస్తు శాస్త్రం భావిస్తుంది. కంటికి చూడడానికి బాగానే ఉన్నా, వివాహ జీవితం చూసుకుని అలాంటి వాటిని వద్దనుకోవడమే ఉత్తమం.

నలుపు తెలుపు

బ్లాక్ అండ్ వైట్ ఫోటో ఫ్రేమ్స్ కాకుండా రంగు రంగుల ఫ్రేమ్స్ కి ప్రాధాన్యత ఇవ్వండి.

Read more RELATED
Recommended to you

Exit mobile version