వాస్తు మనకు ఎంతగానో ఉపయోగపడుతుంది. వాస్తు ప్రకారం అనుసరిస్తే ఎలాంటి సమస్య అయినా తొలగిపోతుంది. అయితే మంగళవారం నాడు ఎలాంటి పనులు చేయకూడదు అనే దాని గురించి ఈరోజు పండితులు మనకు చెప్పారు. మరి ఇక ఎటువంటి ఆలస్యం లేకుండా దీని కోసం చూసేయండి.
మంగళవారం నాడు అసలు జుట్టు కత్తిరించుకోకూడదు. పెద్దవాళ్లు ఎప్పుడు ఈ విషయాన్ని చెబుతూనే ఉంటారు. ఈ విధంగా పాటించడం నిజంగా చాలా ముఖ్యం. అలానే మంగళవారం నాడు హనుమంతుడిని పూజించడం చాలా మంచిది. అలానే హనుమంతునికి ఇష్టమైన పనులు చేయడం కూడా మంచిదే. ఈ తప్పులు చేయకుండా ఉంటే మంగళవారం నాడు దోషాలు తొలగిపోతాయి. అయితే మంగళవారం నాడు ఏ తప్పులు అస్సలు చెయ్యకూడదో చూద్దాం.
గోళ్ళను కత్తిరించుకోద్దు:
మంగళవారం నాడు గోళ్ళను కత్తిరించడం అస్సలు మంచిది కాదు. గోళ్ళు కత్తిరించడం వల్ల నెగిటివ్ ఎనర్జీ వస్తుంది. అదే విధంగా ఇబ్బందులుని తీసుకువస్తుంది.
మినప్పప్పు తో వంటలు చేయొద్దు:
మంగళవారం నాడు మినప్పప్పు తో వంటలు చేసుకోవడం మంచిది కాదు. మంగళవారం నాడు మినప్పప్పు తో వంటలు చేసుకోవడం వల్ల ఇబ్బందులు వస్తాయి.
ఎవరితోనూ గొడవ పెట్టుకోకండి:
మంగళవారం నాడు ఎవరితోనూ గొడవ పెట్టుకొద్దు. ముఖ్యంగా సోదరులతో గొడవ పెట్టుకోకండి.
నల్లటి దుస్తులు ధరించద్దు:
మంగళవారం నాడు నల్లటి దుస్తులు వేసుకోవడం వల్ల దోషాలు వస్తాయి. అలానే ఇది ఆర్థిక ఇబ్బందులని తీసుకువస్తుంది. మానసిక సమస్యలు కూడా తీసుకొస్తుంది. కనుక ఈ తప్పులు అస్సలు చేయకండి. అలానే మంగళవారం నాడు నల్లటి దుస్తులు కొనుక్కోవడం కూడా మంచిది కాదు. ఈ విధంగా మంగళవారంనాడు అనుసరిస్తే మంచి జరుగుతుంది లేదంటే సమస్యలు తప్పవు.