తెలంగాణా అటవీ ప్రాంతంలోకి వీరప్పన్ ని ఎన్ కౌంటర్ చేసిన అధికారి.. !

-

భారీ సంఖ్యలో మావోయిస్టులు ఛత్తీస్ గడ్, మహారాష్ట్రల నుండి తెలంగాణా అటవీ ప్రాంతంలోకి ఎంటర్ అయినట్టు తెలుస్తోంది. ఈ క్రమంలో ఈరోజు ములుగు ఏజెన్సీలో డీజీపీ పర్యటించనున్నారు. ఇక ఆయనతో పాటు ఈ పర్యటనకి ఛత్తీస్ గడ్, మహారాష్ట్ర, ఒడిశా రాష్ట్రాలకి చెందిన అధికారులు కూడా రానున్నారు. ఇక మరి కొద్ది సేపట్లో ములుగు జిల్లా వాజేడు వెంకట పూర్ కి తెలంగాణ డీజీపీ చేరుకోనున్నట్టు చెబుతున్నారు.

ఛత్తీస్ గడ్, మహారాష్ట్రల పోలీసు ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు. ములుగు జిల్లా వాజేడు వెంకటాపురంలో నేడు సి ఆర్ పి ఎఫ్ సెంట్రల్ డిజిపిగా ఉన్న విజయ్ కుమార్ తెలంగాణ,మహారాష్ట్ర,చత్తీస్గడ్ సరిహద్దు ప్రాంతాలను పరిశీలించనున్నారు. గతంలో ఎర్రచందనం స్మగ్లర్ వీరప్పన్ ను మట్టుబెట్టిన విజయ్ కుమార్ మొదటిసారిగా తెలంగాణలో పర్యటిస్తున్నారు. మావోయిస్టుల కదలికల మీద కట్టుదిట్టమైన ఏర్పాట్ల పై ఉన్నతస్థాయి పోలీసు అధికారులతో ఆయన కూడా సమీక్షించనున్నట్లు సమాచారం.

Read more RELATED
Recommended to you

Exit mobile version