న్యూఢిల్లీ: ఉపరాష్ట్రపతి, రాజ్యసభ్య వైస్ ఛైర్మన్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. రాజ్యసభ సమావేశం ప్రారంభమైన వెంటనే పెగాసస్‌పై చర్చకు విపక్ష పార్టీలు ఆందోళన వ్యక్తం చేశాయి. దీంతో వెంకయ్యనాయుడు మనస్థాపం చెందారు. ఐటీ మంత్రి ప్రకటన సమయంలో తృణమూల్ ఎంపీ తన చేతులు నుంచి పత్రాలు లాక్కొని చించిపారేయడం దురదృష్టకరమని ఆవేదన వ్యక్తం చేశారు. సభ్యుల చాలా బాధకరమన్నారు. పార్లమెంటరీ ప్రజా స్వామ్యానికి ఇలాంటి చర్యలు సరికాదని వెంకయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు.
రాజ్యసభలో మూడు రోజలుగా జరుగుతున్న పరిణామాలు మంచిదికాదని వ్యాఖ్యానించారు. సభ్యులు ఎందుకు సహకరించడంలేదో అర్థం కావడంలేదన్నారు. పార్లమెంట్‌ను స్తంభింపజేస్తే లాభమేంటని ప్రశించారు. సభకు సహకరిస్తామని అఖిలపక్ష సమావేశంలో చెప్పిన విషయాన్ని గుర్తు చేశారాయన. సభ్యుల ప్రవర్తన నిరాశపర్చిందని వెంకయ్య మండిపడ్డారు.