పీఎఫ్ ఏ కాదు… ఇలా కూడా ఇన్వెస్ట్ చెయ్యొచ్చు..!

-

ప్రావిడెంట్ ఫండ్ కింద డబ్బులు ఉంచడం చాలా సురక్షితం మరియు మంచి లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ కూడా. అయితే యూనియన్ బడ్జెట్ 2021-22 లో ఈపీఎఫ్ లో కొన్ని మార్పులు చేయడం తెలిసినదే. ఒకవేళ పిఎఫ్ కాంట్రిబ్యూషన్ 2.5 లక్షలు కంటే ఎక్కువగా ఉంటే అది టాక్సిబుల్ అని చెప్పారు. ఈ విషయం అందరికీ తెలుసు.

అయితే ప్రభుత్వం ఎందుకు దీనిని ఇలా చేసింది అనే విషయానికి వస్తే… స్మాల్ సేవింగ్ స్కీమ్స్ మరియు ఫిక్స్డ్ డిపాజిట్లు కంటే ఈపిఎఫ్ అన్నిటి కంటే ఎక్కువ ఇచ్చేది. 2019-20 లో ఇది 8.5% ఉంది. స్మాల్ సేవింగ్ స్కీమ్స్ అయిన కిసాన్ వికాస్ పత్రం మరియు సుకన్య సమృద్ధి అకౌంట్ వంటివి చూస్తే కేవలం 7.1 నుంచి 7.6 శాతం ఇచ్చేవారు. అందుకే ఈపీఎఫ్ లో కాంట్రిబ్యూషన్ చేయడం మంచిది. పైగా రిస్క్ కూడా ఉండదు అని అందరూ అక్కడ కంట్రిబ్యూట్ చేసేవారు.

కానీ కొత్త రూల్ వల్ల ఈపీఎఫ్ ఖాతాదారులు డిసప్పాయింట్ అయ్యారు. ఇప్పుడు NPS గురించి చూద్దాం… రిస్క్ లిక్విడిటీ టాక్స్ బెనిఫిట్ రిటర్న్స్, రిస్క్, లిక్విడిటీ, టాక్స్ బెనిఫిట్ , టైం హోరిజోన్ ఆధారంగా మనం ఎంపిక చేసుకోవచ్చు. మీ డబ్బులు మీరు NPS లో పెట్టారంటే ప్రమాదం ఎక్కువగా ఉండదు. ఇది సేఫ్.

NPS నుండి రాబడిని పాక్షికంగా మార్కెట్ లిమిటెడ్ చేస్తుంది. లిక్విడిటీ చాలా తక్కువగా ఉంటుంది. ఎందుకంటే కొన్ని అత్యవసర పరిస్థితుల్లో మినహాయించి డబ్బు తీసుకోలేము. టాక్స్ బెనిఫిట్స్ మీరు పొందొచ్చు. రూపాయలు యాభై వేలు వరకు మినహాయింపు ఉంటుంది. అధిక ఈక్విటీ భాగంగా NPS రాబడి సాధారణంగా ఆకర్షణీయంగానే ఉంటుంది అయితే మీ పెట్టుబడిని రిటైర్ అయ్యే వరకూ లాక్ చేసే ఉంటుంది.

అదే ELSS అయితే NPS లాగే రిస్కు కూడా కొద్దిగా ఉంటుంది. ఈక్విటీ మరియు ఈక్విటీ రిలేటెడ్ ప్రొడక్ట్స్ మీద ఆధారంగా ఇది ఉంటుంది. మ్యూచువల్ ఫండ్స్ తో పోలిస్తే ఏ పీ ఎఫ్ మరియు ELSS లో రిస్క్ తక్కువగా ఉంటుంది. మూడేళ్ల తర్వాత తీసుకోవచ్చు. ELSS లో సంవత్సరానికి రూపాయలు ఒక లక్ష పెడితే 10 శాతం టాక్స్ పడుతుంది. ఎక్కువ కాలం పెట్టుబడి పెట్టడం ద్వారా మంచి రాబడి పొందొచ్చు. ELSS లో పెట్టుబడి పెట్టడానికి SIP మార్గం ద్వారా మీరు తెలివిగా పెట్టుబడి పెట్టొచ్చు.

ELSS లో పెట్టుబడి పెట్టాలంటే మీరు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే..? మీ పెట్టుబడి లో మీ రిస్క్ ప్రొఫైల్ కు సరిపోయే ఈ రకమైన దానిని ఎంచుకోవాలి. అయితే దీనిలో large-cap stocks, other invest in small & midcap స్టాక్స్ ఉంటాయి. small and midcap stocks అయితే కొంచెం రిస్క్ ఉంటుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version