పేద వాడికి కార్పొరేట్ వైద్యం అందాలని ఆశయంతో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఆరోగ్య శ్రీ పథకం ను ప్రారంభించారు. జగనన్న ప్రభుత్వంలో ఆరోగ్య శ్రీ పరిధి పెంచాం. ఐదు లక్షల నుండి 25 లక్షలకు ఆరోగ్యశ్రీ పరిధిని పెంచాం అని మాజీ మంత్రి విడదల రజని అన్నారు. ఒక సీఎంకి ఏ స్థాయి వైద్యం అందుతుందో అదే వైద్యం పేదలకు అందాలన్నది వైఎస్ కుటుంబ లక్ష్యం. పేద వారికి ఏ ఆరోగ్య సమస్య వచ్చినా గత ప్రభుత్వం లో ఉచితంగా నాణ్యమైన వైద్యం అందించాం.
కానీ ఇప్పుడు ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ ను ఈ రోజు అనారోగ్య ప్రదేశ్ గా మార్చేస్తున్నారు. నెట్ వర్క్ హాస్పిటల్స్ కు మూడువేల కోట్ల బిల్లులు పెండింగ్ లో ఉన్నాయి.నెట్ వర్క్ హాస్పిటల్స్ వైద్యాన్ని నిలిపివేసిన పరిస్థితి. పేద వారికి అనారోగ్యం వస్తే ఎక్కడికి వెళ్ళాలి…ఈ ప్రభుత్వం స్పందించాలి. కొవిడ్ లాంటి వ్యాధి దాడి చేసినా వైఎస్ జగన్ ప్రభుత్వం వెనకడుగు వేయలేదు. కొవిడ్ ను కూడా ఆరోగ్యశ్రీ పథకం లోకి తీసుకు వచ్చాం. 2014 నుండి 19 వరకు అప్పటి టీడీపీ ప్రభుత్వం 5100 కోట్లు ఖర్చు చేసింది. 2019 నుండి 24 వరకు వైసిపి ప్రభుత్వం 13,500 కోట్లు ఖర్చు చేశాం. ప్రభుత్వం వెంటనే నెట్వర్క్ హాస్పిటల్ బిల్లులను చెల్లించాలి. ఆరోగ్యశ్రీ నిర్వహణ కూడా థార్డ్ పార్టీకి అప్పగించాలని చూస్తున్నారు. ప్రైవేటు ఇన్స్యూరెన్స్ కంపనీ లకు ఆరోగ్యశ్రీ ట్రస్ట్ నిర్వహణ అప్పగిస్తే, పేద ప్రజలు ఎక్కడికి వెళ్ళాలి అని ప్రశ్నించారు రజిని.