పదేళ్ల బీఆర్ఎస్ పాలన కేసీఆర్ కుటుంబం పై తెలంగాణ బీజేపీ కీలక నేత, నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ కీలక వ్యాఖ్యలు చేసారు. తాజాగా ఆయన మీడియాతో మాట్లాడారు. పదేళ్ల పాటు తెలంగాణను కేసీఆర్ కుటుంబం దోచుకుందని ఆరోపించారు. కేటీఆర్, కవిత విచారణ అధికారుల ముందు డిమాండ్లు పెడుతున్నారని విమర్శించారు. కేటీఆర్, కవిత కారణంగా కేసీఆర్ చాలా నష్టపోయారని.. వెంటనే వారిని అదుపులో పెట్టకపోతే సర్వం కోల్పోవాల్సిన పరిస్థితులు వస్తాయని తెలిపారు.
తప్పు చేసిన వారందరూ శిక్షార్హులే అని కేటీఆర్ జైలుకు వెళ్లక తప్పదని పేర్కొన్నారు. ఫార్ములా ఈ-రేస్ కేసులో కేటీఆర్ చేసింది దొంగతనమని.. పైగా న్యాయవాదులు లేకపోతే విచారణకు వెళ్లను అని తమాషా చేస్తున్నారని పేర్కొన్నారు. ఢిల్లీ మద్యం కుంభకోణంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న చెల్లె కవితనేమో ఈడీ ఇంటికి రావాలని.. ఏసీ కిందే విచారణ జరపాలంటూ కోరారని ఎద్దేవా చేశారు. కేసీఆర్, కేటీఆర్ సీఎం, మంత్రి అనే భ్రమలోంచి బయటికి రావాలన్నారు.