బిగ్‌బాస్ షోపై తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్న నెటిజ‌న్లు..!

-

కౌశల్ ఆర్మీ కొడుతున్న దెబ్బ‌కు ఇప్ప‌టికే ఆస‌క్తి, క‌ళ త‌గ్గిపోయిన బిగ్ బాస్ 2 షోపై ప్రేక్ష‌కులు తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు. ముఖ్యంగా సోష‌ల్ మీడియాలో అయితే బిగ్ బాస్ పై విమ‌ర్శ‌నాస్త్రాలు సంధిస్తున్నారు. అందుకు కార‌ణం లేక‌పోలేదు. నిన్న జ‌రిగిన కార్ టాస్క్‌లో దీప్తి, శ్యామ‌ల‌పై జ‌రిగిన భౌతిక దాడి గురించే ఇప్పుడు బిగ్ బాస్ ను అంద‌రూ విమ‌ర్శిస్తున్నారు.

బిగ్ బాస్ 2 షోలో ఫైన‌ల్ స్టేజీ వ‌ర‌కు నామినేష‌న్‌ల నుంచి త‌ప్పించుకోవాలంటే కారులో చివ‌రి వ‌ర‌కు ఉండాల్సిందేన‌న్న కాన్సెప్ట్‌తో బిగ్‌బాస్ ఇంటి స‌భ్యుల‌కు కార్ టాస్క్ ఇవ్వ‌గా, అందులో త‌నీష్‌, సామ్రాట్‌, దీప్తి, శ్యామ‌ల‌, గీతా మాధురిలు కూర్చున్నారు. నిద్ర పోయిన కార‌ణంగా గీతా మాధురి టాస్క్ నుంచి త‌ప్పుకుంది. ఇక మిగిలిన వారిలో త‌నీష్‌, సామ్రాట్‌లు దీప్తి, శ్యామ‌ల‌ల‌ను బ‌ల‌వంతంగా కారు నుంచి బ‌య‌ట‌కి పంపేందుకు వారిని కారు నుంచి నెట్టేసే ప్ర‌య‌త్నం చేశారు. ఈ క్రమంలో దీప్తి చేతిపై గాయం కూడా అయింది.

అయితే ఇలా కారు నుంచి దీప్తి, శ్యామ‌ల‌ల‌ను త‌నీష్‌, సామ్రాట్ లు బ‌ల‌వంతంగా తోసేయాల‌ని చూస్తూ వారిపై భౌతిక దాడి చేయ‌డం ప‌ట్ల అంద‌రూ ఇప్పుడు ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు. సోష‌ల్ మీడియాలో బిగ్ బాస్‌కు వ్య‌తిరేకంగా కామెంట్లు, ట్వీట్లు పెడుతున్నారు. మ‌హిళ‌ల‌పై భౌతిక దాడి చేయడం దారుణ‌మని వ్యాఖ్యానించారు. ఓ వైపు దాడి జ‌రుగుతున్నా వారిని బిగ్ బాస్ ఎందుకు వారించ‌లేద‌ని బిగ్ బాస్ వ్య‌వ‌హార శైలిని త‌ప్పు ప‌ట్టారు.

మ‌హిళ వైపు పురుషులు అదోర‌కంగా చూస్తేనే వారు శిక్ష‌కు గుర‌వుతార‌ని చెప్పే నిర్భయ చ‌ట్టం ఉన్న‌ప్ప‌టికీ.. ఇలా వారు మ‌హిళ‌ల‌పై భౌతిక దాడి చేయ‌డం ఎంత వ‌ర‌కు క‌రెక్ట్ అని సామాజిక కార్య‌క‌ర్త‌లు ప్రశ్నిస్తున్నారు. త‌నీష్‌, సామ్రాట్‌ల‌తోపాటు బిగ్ బాస్ షో నిర్వాహ‌కుల‌పై చ‌ర్య‌లు తీసుకోవాల‌ని వారు కోరుతున్నారు. ఏది ఏమైనా నిన్న‌టి ఎపిసోడ్‌లో జ‌రిగిన కార్ టాస్క్ ఉదంతం మాత్రం సోష‌ల్ మీడియా యూజ‌ర్ల‌కు పెద్ద ఎత్తున కోపం తెప్పించిందన్న మాట వాస్త‌వం. అటు కౌశ‌ల్ ఆర్మీ పేరిట ఉన్న ఓ అకౌంట్‌లో కూడా ఈ కార్ టాస్క్‌పై ఘాటుగా స్పందించారు. ఇలా జ‌రిగి ఉండ‌కూడ‌ద‌ని, దీన్ని ఖండిస్తున్నామ‌ని ఆ అకౌంట్ పోస్టులో పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version