Vijay : విజయ్ నెక్స్ట్ సినిమా టైటిల్ అనౌన్స్.. సుడిగాలి సుధీర్ టైటిల్ కొట్టేసిన దళపతి..

-

లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో విజయ్ దళపతి హీరోగా నటించిన చిత్రం లియో. ఈ చిత్రంతో విజయ్ సూపర్ హిట్ సక్సెస్ అందుకున్నారు. ప్రస్తుతం విజయ్ తన 68వ చిత్రాన్ని వెంకట ప్రభువు దర్శకత్వంలో చేస్తున్నారు. ఈ సినిమాకి సంబంధించిన షూటింగ్ పనులను శరవేగంగా జరుపుకుంటుంది.Thalapathy68 వర్కింగ్ టైటిల్ తో చిత్రీకరణ చేస్తున్న చిత్ర బృందం…. ఈరోజు ఈ సినిమా టైటిల్ ని ఫస్ట్ లుక్ తో విడుదల చేశారు.

ఈ సినిమాకి ‘ది గోట్’ (The Greatest Of All Time) అనే ఇంగ్లీష్ టైటిల్ ని ప్రకటించారు. అయితే ఇదివరకే సుధీర్ ఇదే టైటిల్ తో సినిమాను అనౌన్స్ చేశాడు ప్రస్తుతం సుధీర్ చిత్రం షూటింగ్ దశలో ఉంది. విశ్వక్సేన్ తో పాగల్ వంటి చిత్రాన్ని తెరకెక్కించిన నరేష్ కుప్పిలి ఈ సినిమాని తెరకెక్కిస్తున్నాడు. విజయ్ నటిస్తున్న సినిమా పేరు ,సుధీర్ నటిస్తున్న సినిమా పేరు ఒకటే కావడంతో ….సుధీర్ సినిమా ట్రెండ్ అవుతుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version