మరోసారి ట్విట్టర్ వేదికగా చంద్రబాబుపై ఎంపీ విజయసాయి రెడ్డి విమర్శనాస్త్రాలు సంధించారు. గత టీడీపీ ప్రభుత్వ హయాంలో రామాయపట్నం పోర్టుకు అప్పటి సీఎం చంద్రబాబు శంకుస్థాపన చేయగా, భారీ పరిశ్రమ స్థాపించేందుకు ఆసియా పల్ప్ అండ్ పేపర్ (ఏపీపీ) కంపెనీ ముందుకొచ్చింది. రాష్ట్ర ప్రభుత్వానికి, ఏపీపీకి మధ్య రూ.24 వేల కోట్ల అవగాహన ఒప్పందం కూడా కుదిరింది. అయితే, 2019 ఎన్నికల్లో టీడీపీ ఓటమి పాలుకాగా, వైసీపీ సర్కారు గద్దెనెక్కింది. ఆ తర్వాత రామాయపట్నం ప్రాజెక్టు పనులు ఆశించినంత వేగంగా జరగలేదు. ఏపీపీ కంపెనీ ఊసే లేకుండా పోయింది. అయితే.. ఈ నేపథ్యంలో, వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి స్పందించారు.
ఏపీపీ కంపెనీ రూ.24 వేల కోట్లతో రామాయపట్నంలో పేపర్ మిల్లు పెడుతోందని చంద్రబాబు హడావుడిగా భూమి పూజ చేశారని ఎద్దేవా చేశారు విజయసాయి రెడ్డి. ఆ కంపెనీ ఇప్పుడు పీకల్లోతు కేసుల్లో ఇరుక్కుని దివాలా పిటిషన్లు వేసిందని వెల్లడించారు విజయసాయి రెడ్డి. పేపర్ మిల్లు పెట్టడంలేదని చేతులెత్తేసిందని తెలిపారు. చంద్రబాబు వేసిన పునాది రాళ్లన్నింటికీ ఇదే గతి అని విమర్శించారు విజయసాయి రెడ్డి.