బాబు.. ప్రజలు ఛీ కొడుతున్నా సరే..!

-

వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి, టీడీపీ అధినేత చంద్రబాబుపై మరోసారి విమర్శలు గుప్పించారు. పలు కేసుల్లో ఇరుక్కుని అరెస్టయిన వ్యక్తుల హక్కులకు భంగం ఎలా కలిగిందో చంద్రబాబు నాయుడు చెప్పాలని విజయసాయి రెడ్డి తన ట్విటర్ ద్వారా ప్రశ్నించారు. “తమ పార్టీ నేతలు వందల కోట్ల కుంభకోణాలు, ఫోర్జరీ, మోసం కేసుల్లో అరెస్టయితే సిగ్గు పడాల్సింది పోయి, మానవ హక్కుల కమిషన్ కు ఫిర్యాదు చేస్తామని బెదిరిస్తున్నారు నాయుడు బాబు. స్వార్థ బుద్ధితో నేరాలకు పాల్పడి కేసుల్లో ఇరుక్కున్న వారికి హక్కుల భంగం ఎలా కలిగిందో ప్రజలకు జవాబు చెప్పాలి” అన్నారు. ఆపై “సమాంతర పాలన భ్రాంతిలో బాబు గారు మునిగి తేలుతున్నారు. ద్రవ్య వినిమయ బిల్లును కౌన్సిల్ లో అడ్డుకోవడం ద్వారా తాత్కాలిక ఆనందం పొందారు. ఇలాంటి ఉపశమనాలతో బండి లాక్కొస్తున్నారు. వీడియోలు తీసి సభా మర్యాదలు ఉల్లంఘించిన కుమారుడు విప్లవ యోధుడిలా కనిపించి ఉంటాడు. ప్రజలు ఛీ కొడుతున్నా!” అని సెటైర్లు వేశారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version