సాయిధరమ్ తేజ్ ఆక్సిడెంట్ పై విజయసాయి సంచలన ట్వీట్!

-

టాలీవుడ్ యంగ్ హీరో, మెగా అల్లుడు సాయి ధరమ్ తేజ్ నిన్నరోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ సంగతి తెలిసిందే. బంజారాహిల్స్ రోడ్ నంబర్ 45 నుండి గచ్చిబౌలి వెళుతుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. అయితే అతివేగంతో వెళ్ళడం వల్లే ఈ ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది. అయితే ఈ సంఘటన పై వైసీపీ ఎంపి విజయ సాయి రెడ్డి ఆసక్తి కర ట్వీట్ చేశారు.

ysrcp mp vijayasai reddy

యువత బైక్ పై వెళ్తున్నప్పుడు స్పీడ్ తగ్గించుకోవాలని చురకలు అంటించారు విజయ సాయి రెడ్డి. “ప్రమాదానికి గురైన యువ హీరో సాయి ధరమ్ తేజ్ కోలుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అపోలో ఆస్పత్రిలో ఆయన కోలుకుంటున్నారు. హెల్మెట్ ధరించడం సంతోషకరం. యువత బైక్ పై వెళ్తున్నప్పుడు స్పీడ్ తగ్గించుకోవాలని విజ్ఞప్తి.” అంటూ ఎంపి విజయ సాయి రెడ్డి ట్విటర్ వేదికగా తెలిపారు. కాగా ప్రస్తుతం సాయి ధరమ్ తేజ్ ఆస్పత్రిలో ఉన్నారు. ఆయన ఆరోగ్యం కూడా నిలకడగా ఉందని పేర్కొన్నారు వైద్యులు.

Read more RELATED
Recommended to you

Exit mobile version