ఎన్టీఆర్ సినిమాల పై విజయసాయిరెడ్డి ట్వీట్ !

-

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు నిన్న కంటతడి పెట్టుకున్న సంగతి తెలిసిందే. అసెంబ్లీలో తన భార్య పై కామెంటు చేస్తున్నారంటూ చంద్రబాబు నాయుడు మీడియా ముందు బోరున విలపించారు. అయితే చంద్రబాబు కంటతడి పెట్టడంతో పై.. వైసీపీ రాజ్యసభ సభ్యులు విజయసాయి రెడ్డి తన స్టైల్లో కౌంటర్ ఇచ్చారు. నారా చంద్రబాబు నాయుడు యాక్టింగ్ కు… ఆస్కార్ అవార్డు ఇవ్వవచ్చు అంటూ వ్యంగ్యంగా క్రియేట్ చేశారు. అంతేకాదు సీనియర్ ఎన్టీఆర్ సినిమా తో పోల్చుతూ కామెంట్ చేశారు విజయసాయిరెడ్డి.

“రాజకీయ నాయకులకు ఆస్కార్ అవార్డు ఉంటే చంద్రబాబు హ్యాట్రిక్స్ పై హ్యాట్రిక్స్ కొట్టేవాడు. ఎన్టీఆర్ సినిమాల్లో మాత్రమే నటించేవారు – చంద్రంబాబుకు మాత్రం…నిజ జీవితం, రాజకీయాల్లో కూడా…..నటనే. అది అమోఘం, అనితర సాధ్యం. “అంటూ చంద్రబాబు నాయుడుకు చురకలు అంటించారు విజయసాయి రెడ్డి.

ఇక అంతకు ముందు  “కార్యసాధకుల శపథాలు ఇలా ఉండవు. అప్పట్లో జగన్ గారు అసెంబ్లీ గడువు ముగిసేంతవరకు తిరగిరానని బయటకు వచ్చారు. సిఎంగానే లోపలికి ప్రవేశించారు. ప్రజల మధ్యే ఉంటూ తన పార్టీ భవిష్యత్తును నిర్మించారు. నిస్పృహతో బాబులాంటి వారు చేసే శపథాల్లో నాటకీయత తప్ప నిబద్ధత కనిపించదు.” అంటూ మరో ట్వీట్ లో వెల్లడించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version