కేసీఆర్ దర్శనం ఇవ్వాలంటే.. మళ్ళీ ఓట్లు రావాల్సిందే : రాములమ్మ సెటైర్లు

-

తెలంగాణా సీఎం కేసిఆర్ పై విజయశాంతి ఫైర్ అయ్యారు.కేసీఆర్ దర్శనం ఇవ్వాలంటే.. మళ్ళీ ఓట్లు రావాల్సిందేనని   రాములమ్మ సెటైర్లు విసిరారు.తెలంగాణ సీఎం కేసీఆర్ గారు అధికారులకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారని… పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి పనుల్ని తానే స్వయంగా చెకింగ్ చేస్తానని, చెప్పకుండా… చెయ్యకుండా వచ్చి పరిశీలిస్తానని అన్నారని పేర్కోన్నారు విజయశాంతి. ఆఫీసర్లు అందుబాటులో ఉండి తానడిగిన రిపోర్టులివ్వాలని… తేడా వస్తే స్పాట్‌లోనే సస్పెన్షన్లు ఉంటాయని సీరియస్‌గా హెచ్చరించారు… సీఎం మాటలకు భయపడాల్సిన పనిలేదని అధికారులకు బాగా తెలుసు అన్నారు.

ఎందుకంటే, ఆయన ఒక మాట అన్నారంటే… అది జరిగే పని కాదని అందరికీ తెలుసు అని… వస్తున్నా వస్తున్నా అనడమే గాని… ఓట్ల పండగప్పుడు తప్ప ఫాంహౌస్, ప్రగతి భవన్ వదిలి కేసీఆర్ రారని అందరికీ బాగా అర్థమైందని చురకలు అంటించారు. సాగర్ ఎన్నికలప్పుడు 15 రోజుల్లో మళ్ళీ సాగర్ వచ్చి అభివృద్ధి అంటే ఏంటో చూపిస్తానన్నారు… నెలన్నర దాటినా అతి గతీ లేదనీ మండిపడ్డారు. అంతకు ముందు హుజుర్ నగర్ ఎన్నికలప్పుడు వచ్చి 15, 20 రోజుల్లో నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ వరకు పర్యటించి అభివృద్ధి అంటే ఏంటో చూపిస్తానన్నారు… ఏడాదిన్నరైనా సారు అడ్రస్ లేడనీ ఫైర్ అయ్యారు. ఇక చాలా ఏళ్ళ కిందట వరంగల్ నగరం మురికివాడలకు వచ్చి… వారికి కొత్త ఇళ్ళు కట్టిస్తానని, దావత్ చేసుకోవడానికి 5 నెలల్లో మళ్లీ వస్తానని అన్నారు… ఏం జరిగిందో చెప్పక్కర్లేదని చురకలు అంటించారు. ఇక ఈ తాజా చెకింగులు, వార్నింగుల అర్థమేంటో నేను చెప్పాల్సిన పనిలేదని… ఆయన దర్శనం కావాలంటే మళ్ళీ అక్కడ ఓట్ల పండగ రావాలేమో… కాదు, తప్పదు అనుకుంటే ఏవో కొన్ని చోట్లకు వెళ్ళి ముఖం చూపించి తిరిగిరావడమే తప్ప, ఈ సీఎం గారు తన పనితీరుతో తెలంగాణను ఉద్ధరిస్తారంటే చిన్న పిల్లలు కూడా నమ్మే పరిస్థితి లేదు. అయినా, వెళితే మంచిదే అని ఏద్దేవ చేసారు. ఎంతమంది ఉద్యోగాలు, 3 ఎకరాల భూమి, డబుల్ బెడ్రూం ఇళ్ళు, నిర్వాసితుల పరిహారం బాధితులు, ఇంకా… ధాన్యం కొనుగోళ్ళు కాక నష్టపడిన రైతులు సీఎం గారిని అడ్డుకుంటారో తెలుస్తుందన్నారు. కానీ, బాధాకరం ఏమిటంటే, ఇక వారిపై ఈ ముఖ్యమంత్రి గారి జులుం, కుక్కలు, చెప్పులు అంటూ శాపనార్థాలు… కవర్ చేసిన జర్నలిస్టులపై కేసులు, జైళ్ళు…. వంటి చిత్ర విచిత్ర తిక్క తుగ్లక్ విన్యాసాలన్నీ కూడా ఆవిష్కృతం చెయ్యవచ్చనీ తెలిపారు. అలాగే ఈ సీఎం గారు సెక్రెటేరియట్ వెళ్ళి చూస్తే కూల్చివేత…. ప్రగతి భవన్‌కు పంపితే పక్క భవనాల కూల్చివేత… వరంగల్‌కు వెళితే జైలు కూల్చివేత…. ఇప్పుడు జిల్లాలలో ఏమేమి కూలుస్తాడో అని ప్రజలు భీతిల్లే పరిస్థితులు కూడా వినబడుతున్నాయని విజయశాంతి ఫైర్ అయ్యారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version