క్లౌడ్ బరస్ట్ కాదు కేసిఆర్ గారు…మీకు మైండ్ బరస్ట్, పరిపాలన వరస్ట్ – విజయశాంతి

-

క్లౌడ్ బరస్ట్ కాదు కేసిఆర్ గారు…మీకు మైండ్ బరస్ట్…మీ పరిపాలన వరస్ట్ …అని ప్రజాభిప్రాయమని విజయశాంతి కౌంటర్‌ ఇచ్చారు. భారీ వర్షాల వెనుక విదేశీ కుట్ర ఉందంటూ ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యాఖ్యానించడం హాస్యాస్పదం. బహుశా సీఎంకు మతి భ్రమించినట్లుందని ఫైర్‌ అయ్యారు. నిన్న కేసీఆర్ వరద ముంపు ప్రాంతాల పర్యటనను చూసి జనం నవ్వుకుంటున్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వరద ప్రాంతాల్లో పర్యటిస్తే బాధితులకు భరోసా కలగాలి. ఆదుకుంటారనే నమ్మకం ఏర్పడాలి. కానీ, ఈ సీఎం అక్కడికి వెళ్లి చేసిన కామెంట్స్ జోకర్ ను తలపిస్తున్నాయని ఎద్దేవా చేశారు.

గోదావరికి వరదలు గతంలో ఎన్నోసార్లు వచ్చినయ్… ఈసారి కూడా వచ్చినయ్.. భవిష్యత్తులో రావని కూడా చెప్పలేం… కానీ, కేసీఆర్ కు మాత్రం భారీ వర్షాలు మానవ సృష్టిలా కన్పిస్తోంది. పైగా విదేశాల కుట్రనట అంటూ ఎద్దేవా చేశారు. కుట్రలకే అతిపెద్ద కుట్రదారుడు కేసీఆర్. తానే పెద్ద ఇంజనీరింగ్ నిపుణుడినని గొప్పలు చెప్పుకున్న కేసీఆర్, రీడిజైన్ చేసిన కాళేశ్వరం ప్రాజెక్టు పంప్ హౌజ్ వర్షాలకు మునిగిపోయిందని ఫైర్ అయ్యారు.

మిషన్ కాకతీయ పేరుతో పూడిక తీయడమే తప్ప, కరకట్టల నిర్మాణాన్ని విస్మరించడంతో అనేకచోట్ల చెరువులు, కుంటలు తెగి వేల ఎకరాల పంట నష్టానికి దారి తీసిందని.. పేర్కొన్నారు. తన పాలనా వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు ఇప్పుడు కేసీఆర్ పడరాని పాట్లు పడుతున్నారు. విదేశీ కుట్ర పేరుతో మరో డ్రామాకు తెరదీశారు. వారం రోజులుగా వరద ముంపుతో ప్రజలు అల్లాడుతుంటే ఒక్క మాట కూడా మాట్లాడలేదు. జీతాలందక ప్రభుత్వ ఉద్యోగులు ఇబ్బంది పడుతున్నరు. జీతాలివ్వడం చేతగాక, వర్షాల అంశాన్ని విదేశీ కుట్ర పేరుతో అంతర్జాతీయం చేయాలని కేసీఆర్ ప్లాన్ చేస్తున్నట్లు కన్పిస్తోందని ఆగ్రహించారు రాములమ్మ.

Read more RELATED
Recommended to you

Exit mobile version