కరోనా కేసుల నేపధ్యంలో దేవాలయాల విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటున్నారు అధికారులు. ఈ నేపధ్యంలోనే ప్రముఖ దేవాలయాలు అన్నింటిలో కూడా అధికారులు చర్యలు చేపడుతున్నారు. విజయవాడ అమ్మవారి దేవాలయంలో కొన్ని సమస్యలు కూడా వస్తు ఉన్నాయి. దీనితో భక్తుల ప్రవేశాన్ని తగ్గిస్తున్నారు. అమ్మవారి ఆలయంలో కరొనా తీవ్రత దృష్ట్యా ప్రస్థుతము ఉదయం 6-30 ని.ల నుండి 11.00 గం.ల వరకు భక్తులకు దర్శనం కల్పించబడుచున్నది అని అధికారులు పేర్కొన్నారు.
భక్తుల కోరిక మేరకు దేవస్థాన స్థానాచార్య విష్ణుభట్ల శర్మ ఆదేశాల మేరకు 29-5-2021 నుండి ఉదయం 11-30 ని.ల వరకు భక్తులకు అమ్మవారి దర్శనం కల్పిస్తారు. చైర్మన్ పైలా సోమినాయుడు మరియు ఆలయ కార్యనిర్వణాధికారి భ్రమరాంబ సమావేశమై దర్శన సమయాలు పై నిర్ణయం తీసుకున్నారు.