అమరావతి: ఏపీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి మరోసారి మండిపడ్డారు. ఏపీ, తెలంగాణ మధ్య జలవివాదాలకు చంద్రబాబే కారణమని ఆయన వ్యాఖ్యానించారు. ఓటుకు నోటు కేసు కుట్ర ఇప్పటికీ రాష్ట్రాన్ని పట్టి పీడిస్తోందని విజయసాయి ఆరోపించారు. ఓటుకు నోటు కేసులో అరెస్ట్ తప్పించుకునేందుకు అప్పుడు తెలంగాణలో కట్టిన అక్రమ సాగు నీటి ప్రాజెక్టులను చంద్రబాబు ప్రశ్నించలేకపోయారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఐదు కోట్ల మంది ఆంధ్రుల జీవితాలను తాకట్టు పెట్టిన ఘనత చంద్రబాబుకు దక్కుతుందన్నారు.
ఇదే చంద్రబాబు పొలిటికల్ ఫిలాసఫీ!
-