15 వందల కోట్ల భూములని ఓ పెద్దమనిషికి కట్ట బెడుతున్నారు : రఘునందన్ రావు

-

కేసీఆర్ కుటుంబం ధరణి పేరుతో దోచుకున్నది కక్కిస్తామని రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ ఢిల్లీ నేతలు చెప్పారు. కానీ చట్టంలో లొసుగులను అడ్డం పెట్టుకొని కొందరు మంత్రులు భూములు ఎలా కబ్జా పెట్టాలని చూస్తున్నారు అని బీజేపీ ఎంపీ రఘునందన్ రావు అన్నారు. శంకర పల్లి మండలం కొండకల్, రామ చంద్ర పురం మండలం వెలిమల గ్రామాల మధ్య కొంత మిగులు ల్యాండ్ ఉంది. 450 ఎకరాలు ఉంటుంది. 1993 లో అక్కడ ఉండే గిరిజనులు ఆ భూములు లో వ్యవసాయం చేసుకుంటున్నారు. ఆ భూములకు పట్టాలు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. ఇందులో 170 ఎకరాలు ప్రభుత్వం ఇండస్ట్రీ లకి ఇచ్చింది.

మిగులు భూమిని వేలిమల గ్రామానికి కేటాయించింది… ఆ భూమి ఎవరి కబ్జా లో ఉంది వారికి పట్టాలు ఇవ్వాలని ప్రభుత్వం ఆదేశించింది. అప్పటి టీఆర్ఎస్ నాయకులు కబ్జా చేయాలని అనుకున్నారు. ఆ నేత ఇప్పుడు కాంగ్రెస్ లో చేరారు. చివరకు 85 ఎకరాలు మిగిలింది. ఆ భూముల్లోకి పోలీస్ లు వెళ్లొద్దని హై కోర్టు ఆదేశాలు ఇచ్చింది ఈ నెల 8న. అయినా పోలీస్ లు అక్కడకి వెళ్లి గోడలు కట్టిస్తున్నారు. 15 వందల కోట్ల భూములని ఓ పెద్దమనిషి కి కట్ట బెడుతున్నారు అని రఘునందన్ రావు అన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version