Vikram:‘విక్రమ్’కు దక్కిన గౌరవం..ప్రెస్టీజియస్ స్టేజీపై కమల్ హాసన్ సినిమా ట్రైలర్ రిలీజ్

-

యంగ్ డైరెక్టర్ లోకేశ్ కనకరాజ్ దర్శకత్వంలో విశ్వనటుడు కమల్ హాసన్ హీరోగా తెరకెక్కిన చిత్రం ‘విక్రమ్’. ఇందులో మాలీవుడ్ స్టార్ హీరో ఫాహద్ ఫాజిల్, కోలీవుడ్ వెర్సటైల్ యాక్టర్ , మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి కీలక పాత్రలు పోషించారు. ఈ చిత్రం ఈ ఏడాది జూన్ 3న విడుదల కానుంది.

ఈ చిత్ర అప్ డేట్ కోసం సినీ అభిమానులు ఈగర్ గా వెయిట్ చేస్తున్న క్రమంలో దర్శకులు లోకేశ్ కనకరాజ్ గుడ్ న్యూస్ చెప్పేశారు. ట్విట్టర్ వేదికగా ట్రైలర్ రిలీజ్ గురించి తెలిపాడు. సినీ ప్రముఖులు, ఇండస్ట్రీ వాళ్లు గౌరవించే కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ లో ‘విక్రమ్’ సినిమా ట్రైలర్ రిలీజ్ చేయబోతున్నట్లు పేర్కొన్నారు.

విస్టా వర్స్, లోటస్ మెటా ఎంటర్ టైన్మెంట్ వారి సహకారంతో కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ ప్రదర్శనలో అదే స్టేజీపైన ‘విక్రమ్’ థియేట్రికల్ ట్రైలర్ లాంచ్ ఉంటుందని చెప్పారు. ఈ విషయం తెలుసుకుని అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. హ్యాష్ ట్యాగ్ విక్రమ్, విక్రమ్ ఇన్ కేన్స్, విక్రమ్ విస్టా వర్స్ , కేన్స్ 2022 పదాలను ట్వీట్ చేస్తున్నారు. లోకేశ్ కనకరాజ్ దర్శకత్వం వహించిన గత చిత్రాలు బాక్సాఫీసు వద్ద దుమ్ము రేపిన సంగతి తెలిసిందే.

కార్తీతో ‘ఖైదీ’ సినిమా చేయగా, తలపతి విజయ్ తో ‘మాస్టర్’ సినిమా చేశాడు లోకేశ్ కనకరాజ్. ‘ఖైదీ, మాస్టర్’ ..ఈ రెండు సినిమాలూ తెలుగులోనూ విడుదలై ఘన విజయం సాధించాయి. లోకేశ్..ప్రస్తుతం కమల్ హాసన్ తో ‘విక్రమ్’ సినిమా చేస్తున్నాడు. ‘ఖైదీ’ సినిమాను హిందీలో బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవగణ్ ‘భోళా ’ పేరుతో రీమేక్ చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version