కమల్ హాసన్ ‘విక్రమ్’ టికెట్ల ధరలివే..సినిమాపై భారీ అంచనాలు

-

లోకనాయకుడు కమల్ హాసన్, మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి , ఫహద్ ఫాజిల్, సూర్య కలిసి నటించిన పిక్చర్ ‘విక్రమ్’. పాన్ ఇండియా ఫిల్మ్ గా తెరకెక్కిన ఈ మూవీ..ఈ నెల 3న విడుదల కానుంది. ఈ సినిమాను తెలుగులో శ్రేష్ట్ మూవీస్ వారు విడుదల చేస్తున్నారు.

ఈ నేపథ్యంలో ఉభయ తెలుగు రాష్ట్రాల్లో సినిమాకు సంబంధించిన టికెట్ ధరల వివరాలు తెలిపారు. సింగిల్ స్క్రీన్స్ లో అయితే తెలంగాణలో రూ.150, ఏపీలో రూ.147 అని, మల్టీ ప్లెక్స్ లో తెలంగాణలో రూ.195, ఏపీలో రూ.177 అని తెలిపారు. అనిరుధ్ సంగీతం అందించిన ఈ పిక్చర్ ను కమల్ హాసన్, ఆర్.మహేంద్రన్ సంయుక్తంగా ప్రొడ్యూస్ చేశారు.

కమల్ హాసన్ దాదాపు మూడేళ్ల తర్వాత ఈ చిత్రంతో సినీ ప్రేక్షకులను పలకరించనున్నాడు. విశ్వనటుడు తెలుగు ప్రేక్షకులకు చివరగా ‘విశ్వరూపం2’ సినిమాలో కనిపించాడు. ‘మహా నగరం, ఖైదీ, మాస్టర్’ చిత్రాల తర్వాత లోకేశ్ కనకరాజ్ చేస్తున్న ఫిల్మ్ ఇది. ఫిల్మ్ లో మాస్ ఎలిమెంట్స్ ప్లస్ యాక్షన్ థ్రిల్లింగ్ సీన్స్ ఎక్సలెంట్ గా వచ్చినట్లు మేకర్స్ ధీమా వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version