విక్రమ్ న్యూ లుక్.. షాక్ అవుతున్న అభిమానులు..

-

తమిళ స్టార్ హీరో చియాన్ విక్రమ్ ప్రయోగాలు చేయడంలో ఎప్పుడూ ముందుంటారు. ఇప్పటికే ప్రతి సినిమాలో సరికొత్తగా కనిపిస్తూ తన నటనను మరింత పెంచుకుంటూ ముందుకు వెళుతున్నారు. అయితే తాజాగా ఇప్పుడు మరో కొత్త అవతారంలో కనిపించారు. విక్రమ్ ను ఈ లుక్ లో చూసిన ఆయన అభిమానులంతా షాక్ అవుతున్నారు..

హీరో చియాన్ విక్రమ్ తెలుగు, తమిళ భాషల్లో స్టార్ హీరోగా నిలదొక్కుకున్నారు. తమిళ హీరో అయినప్పటికీ తెలుగులో తనకంటూ ప్రత్యేక మార్కెట్ను క్రియేట్ చేసుకున్నారు. డబ్బింగ్ సినిమాలతోనే తెలుగులో మంచి ఫేమస్ అయ్యారు. ముఖ్యంగా అపరిచితుడు సినిమాతో తెలుగులో భారీ క్రేజ్ సంపాదించేసారు విక్రమ్. అయితే ఈ సినిమా నుంచి ప్రయోగాత్మక సినిమాలో చేయడం మొదలుపెట్టారు. సినిమా సక్సెస్ అయిన ఫెయిల్ అయిన వాటితో సంబంధం లేకుండా తన ప్రయోగాలను చేసుకుంటూ వెళ్తారు. అంతేకాకుండా సినిమాలో తన పాత్రకి పూర్తిస్థాయిలో న్యాయం చేస్తారు. ఇందుకోసం ఎంత కష్టమైనా పడతారు. ప్రతీసారి తన శరీరాన్ని ఊహించని రీతిలో మార్చుకోవడానికి సైతం సిద్ధపడతారు. అయితే ఇంత కష్టపడినా ఇన్ని ప్రయోగాలు చేసిన విక్రమ్ కు సరైన విజయాలు అందకుండా పోతున్నాయి. అయితే మణిరత్నం దర్శకత్వంలో వచ్చిన పొన్నియన్ సెల్వం సినిమా హిట్ అయ్యి కొంత జోష్ను అందించింది. అయితే ఇప్పుడు తాజాగా తంగలన్ మూవీలో నటిస్తున్నారు విక్రమ్. ఈ సినిమా కోసమే ఈ కొత్త లుక్ అంటూ వార్తలు వినిపిస్తున్నాయి..

ఈ సినిమా 19 శతాబ్ధంలోని కోలార్‌ గోల్డ్‌ ఫీల్స్‌ నేపథ్యంలో తెరకెక్కనుండగా.. పా.రంజిత్‌ దర్శకత్వం వహిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ఇప్పటికే రిలీజ్ అయిన పోస్టర్లు, టీజర్ సినిమా పైన భారీ అంచనాలను పెంచేశాయి. తమిళ్, హిందీ భాషల్లో ఒకేసారి షూటింగ్ జరుపుకోవడం విశేషం. ఇతర భాషల్లో సైతం డబ్బింగ్ చేసి విడుదల చేయాలని సన్నాహాలు చేస్తుంది చిత్ర బృందం. ఈ సినిమాను త్రీడీలో రూపొందిస్తున్నారు. ఇన్ని ప్రత్యేకతలు ఉన్న ఈ సినిమాలో మరో విశేషం విక్రమ్ కొత్త లుక్ లో కనిపించనున్నారు. ఇప్పటి వరకు విక్రమ్ ఏ సినిమాలోని ఈ లుక్ ని చూపించలేదు. అయితే తాజాగా ఈ లుక్కు సోషల్ మీడియాలో అప్లోడ్ చేయగా ప్రస్తుతం వైరల్ గా మారింది. బ్యాక్‌ టు ది ఫ్యూచర్‌ అంటూ విక్రమ్‌ ఈ సినిమలోని తన పాత్రకు సంబంధించిన ఫోటోలను సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశాడు.

Read more RELATED
Recommended to you

Exit mobile version