మరోసారి మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ మీడియా ముందుకొచ్చి..వైసీపీ ప్రభుత్వానికి అలెర్ట్ జారీ చేశారు. మొదట నుంచి పరోక్షంగా జగన్‌కు మద్ధతు నిలుస్తూ వస్తున్న ఉండవల్లి..వైసీపీ ప్రభుత్వం చేస్తున్న తప్పులని ఎత్తిచూపుతూ ఎప్పటికప్పుడు సరిచేసుకోవాలనే విధంగా ఆయన చెబుతూ ఉంటారు. ఇక తాజాగా తూర్పు గోదావరి అనపర్తిలో చంద్రబాబు సభకు మొదట పర్మిషన్ ఇచ్చి..తర్వాత పోలీసులు అడ్డుకోవడం, బాబు పాదయాత్ర చేసుకుంటూ సభ ప్రదేశానికి వెళ్ళడం, సభని సక్సెస్ చేయడం తెలిసిందే.
చంద్రబాబుని అడ్డుకోవడంపై ఉండవల్లి స్పందించారు. చంద్రబాబును అడ్డుకోవడం వైసీపీకి మైనస్ అవుతుందని, దివంగత వైఎస్ రాజశేఖర రెడ్డి నుంచి టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ వరకూ పాదయాత్రలు చూశానని, ఇప్పటి వరకు జరిగిన పాదయాత్రల్లో నిన్న చంద్రబాబును అడ్డుకున్న పరిస్థితి ఎప్పుడూ చూడలేదని అన్నారు.
రాజకీయాల్లో ఆత్మహత్యలే ఉంటాయని.. నాడు కాంగ్రెస్ జగన్‌ను జైలుకు పంపడం వల్ల ముఖ్యమంత్రి అయ్యారని చెప్పుకొచ్చారు. అంటే ఎంత అణిచివేస్తే అంత పైకి లేస్తారనే విధంగా ఉండవల్లి కామెంట్స్ ఉన్నాయి.
గత టిడిపి ప్రభుత్వంలో జగన్‌ని అనేక రకాలుగా అవమానాలకు గురి చేశారు. అలాగే ఆయన పాదయాత్రపై సెటైర్లు వేశారు. కానీ జగన్ ప్రజా మద్ధతు పొంది అధికారంలోకి వచ్చారు. అయితే అధికారంలోకి వచ్చిన జగన్..చంద్రబాబుని అనేక అవమానాలకు గురి చేశారు..ఆయన్ని కొందరు వైసీపీ నేతలు బూతులు తిడుతున్నారు. అలాగే ఆయన పర్యటనలని ఎక్కడకక్కడ అడ్డుకునేలా చేస్తున్నారు. తాజాగా అనపర్తిలో అదే చేశారు.
కానీ బాబు తిరుగుబాటు జెండా ఎగరవేసి..నడుచుకుంటూ సభ జరిగే చోటుకు వెళ్ళి..జగన్, పోలీసులపై ఫైర్ అయ్యారు. ఇలా అడ్డుకుంటూ చంద్రబాబు ఇమేజ్‌ని జగన్ పెంచుతున్నట్లు కనిపిస్తుంది. అందుకే ఉండవల్లి అదే తరహాలో బాబుని అడ్డుకోవడం వైసీపీకి మైనస్ అవుతుందని మాట్లాడారు.