దేవతలకు అమృతాన్ని ప్రసాదించి లోకాలకు శాశ్వత రాక్షస బాధ లేకుండా చేయాలనుకున్న శ్రీమన్నారాయణుడు మోహినీ రూపాన్ని ధరించాడు. శివుడు మోహినిచే వ్యామోహితుడై వెంటబడ్డాడు. ఆ దశలో శివుని కోపం నుంచి, ఆపుకోలేని తమకం నుంచి వెలువడిన తేజస్సు దుష్ప్రదేశంలో పడింది. దాని నుండి భయం కర రూపం గల రాక్షసుడు పుట్టుకొచ్చాడు. వాడే క్రోధాసురుడు. రాక్షసగురువు శుక్రాచార్యుడు. వానికి విద్యలు నేర్పి సూర్య మంత్రం కూడా ఉపదేశించాడు. క్రోథా సురుడు సూర్యుని కోసం ఘోరమైన తపస్సు చేసి ముల్లోకాలను జయించే శక్తిని, లోక ప్రసిద్ధిని, చావులేకుండా ఉండేలా వరాలుగా పొందాడు.
ప్రీతి అనే ఆమెను పెళ్లాడి, ఆవేశపురిని రాజధానిగా చేసుకున్నాడు. మూషికాసురుడి ప్రోద్బలంతో లోకాల న్నింటినీ క్రోధావేశంతో పీడించ సాగాడు. వాడి క్రోధాగ్ని తట్టుకోలేక దేవ తలు, మునులు యధావిధిగా లంబోదరుని ఆశ్రయించారు. లంబోదర అవతారుడైన గణపతి క్రోధాసురుని వీచమణచాడు. లంబోదరుని ధాటిని తట్టుకోలేని క్రోధాసురుడు శరణువేడాడు. దాంతో అనుగ్రహమూర్తివయైన గణనాథుడు దుష్ట శిక్షణాదులందు తప్ప నీవు ఈ లోకం లోకి రావద్దంటూ క్రోధుని తన నేత్రమునందు ఇముడ్చుకున్నాడు. క్రోధాసురుడికి లోకసంచారాన్ని అనుమతిస్తూనే కొన్ని జాగ్రత్తలు తెలిపాడు. నీవు ఆవేశించిన జనులు కారణం లేకుండానే కోపం తెచ్చుకుంటారు, విచక్షణ కోల్పోతారు. విరోధ కారకులవుతారు కాబట్టి ప్రజలు నిన్ను ఆశ్రయించుకుందురు గాక! అని లంబోదరుడు అంటాడు. అప్పటినుండీ దేవతలు, మునులు, ప్రజలు లంబోదరుని పూజించి తమపై క్రోధానురుని ప్రభావం పడకుండా జాగ్రత్తపడుతున్నారు.
మూడవరోజు పూజవలన సౌభాగ్యగణపతి అనుగ్రహంతో స్త్రీలకు సౌభాగ్యం కలుగుతుంది.
విఘ్నేశ్వరుని వాహనము ఎలుక. ఎలుక చాలా చిన్నది. అంటే సూక్ష్మజీవులకు కూడా నిర్లక్ష్యము చేయకూడదనే భావన. అతడు స్థూలకాయుడు. అతని వాహనము సూక్ష్మ దేహము కలది. ఇది మనస్సునకు ప్రతీకము. ఎలుకను వాహనముగా చేసుకొనుట అనగా మనస్సు నియంత్రణ మొనర్చుటమని అర్థము. మనస్సును యంత్రించిన వాడే గొప్ప మేధావంతుడు. అతడు స్థూలకాయుడై తన వాహనమునకు శ్రమ లేకుండా అతను అఘమా సిద్ధితో తేలికగా నుండును.