BRS ప్రభుత్వ హయాంలో వివిధ శాఖల్లో 1,60,083 ఉద్యోగాలు భర్తీ చేసాము: వినోద్ కుమార్ బోయినిపల్లి

-

వినోద్ కుమార్ బోయినిపల్లి, వెంకటేష్ నేత కి కౌంటర్ ఇచ్చారు. 60 గ్రూప్ 1 ఉద్యోగాలతో రేవంత్ రెడ్డి ప్రభుత్వం భర్తీ మొదలు పెట్టిందని అన్నారు. అలానే ఎన్నికల్లో రెండు లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తామని కాంగ్రెస్ ప్రచారం చేసింది అని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం 1,99,940 ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేయాల్సి ఉంది అని చెప్పారు.

అలానే ఏ ఏ శాఖల్లో ఖాళీగా పోస్టులు ఉన్నాయో త్వరగా తేల్చాలని డిమాండ్ చేస్తున్నాం అని అన్నారు. BRS ప్రభుత్వ హయాంలో వివిధ శాఖల్లో 1,60,083 ఉద్యోగాలు భర్తీ చేసామని ఆయన చెప్పారు. అలానే 40 వేల ఉద్యోగాల భర్తీ ప్రక్రియ మొదలు అయ్యి వివిధ దశల్లో ఉందని చెప్పారు. మేము చెప్పినా వినకుండా ప్రతిపక్ష పార్టీల మాటలు విన్నారు నిరుద్యోగ యువత ప్రస్తుతం ఉన్న జోనల్ వ్యవస్థను మార్చవద్దని కాంగ్రెస్ ని కోరుతున్న అని అన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version