తాజాగా ఒక వార్త వెలుగు లోకి వచ్చింది. చర్లపల్లి లో నకిలీ క్యాన్సర్ మందుల తయారీ పై కొరడా. వివరాల లోకి వెళితే.. ఇండియన్ జెనోమెక్స్ ఫార్మా కంపెనీని సీజ్ చేసిన డ్రగ్ కంట్రోల్ అధికారులు అనుమతులు లేకుండా క్యాన్సర్ మందులు తయారు చేస్తోంది జెనోమెక్స్. జెనోమెక్స్ నకిలీ క్యాన్సర్ మందులు తయారు చేసి వాటిని విక్రయిస్తోంది.
పెద్ద మొత్తంలో నకిలీ క్యాన్సర్ మందులను కంపెనీ తయారు చేస్తోంది. దీనితో డ్రగ్ కంట్రోల్ అధికారులు సీజ్ చేసారు. ఈ విషయం పై జెనోమెక్స్ డైరెక్టర్ అనిల్ కుమార్‌ను అదుపు లోకి తీసుకున్నారు డ్రగ్ కంట్రోల్ అధికారులు. కొన్ని ఫార్మా కంపెనీలకు మందులు సరఫరా చేస్తున్నట్లు అనిల్‌కుమార్ తెలిపారు.