ఇదేంటి.. నా మరణదిన వేడుకలకు రండి.. అభిమానులకు లేఖ

-

వివాహానికో, గృహ ప్రవేశానికో లేక పుట్టిన రోజు వేడుకలనో.. శుభకార్యాలకు ఆహ్వాన పత్రికను ముద్రించి బంధుమిత్రులకు పంపించడం సాధారణమే! కానీ నా మరణదిన వేడుకలు ఘనంగా చేసుకుంటున్నా మీరు తప్పకుండా రావాలని ఆహ్వాన పత్రిక అందుకుంటే ఎలా ఉంటుంది? ఇదేం ఆహ్వానం అనిపించకమానదు. ‘మీ అందరికీ నా మరణ దిన వేడుకలకు ఆహ్వానం పలుకుతున్నాను.. ఇన్నాళ్లూ చేసుకున్న పుట్టిన రోజుకు అర్ధం లేదని, మరణ దినోత్సవ వేడుకలు  చేసుకోవాలనుకుంటున్నాను.. నా మరణ సంవత్సరాన్ని 2034గా నిర్ణయించుకున్నాను.. నేను మరణించే సమయం ఇంకా 12 ఏళ్ళు ఉంది. అందువల్ల ఈరోజు నుంచే 12వ మరణ దినోత్సవాన్ని జరుపుకుంటున్నాను. కావున మీరందరూ వచ్చి నన్ను ఆశీర్వదించండి’’.. ఈ వెరైటీ ఆహ్వాన పత్రిక ప్రస్తుతం ఏపీలో చర్చనీయాంశంగా మారింది. బాపట్ల జిల్లా చీరాలకు చెందిన మాజీ మంత్రి, వైసీపీ నేత పాలేటి రామారావు.. ఇలా తన మరణ దిన ఆహ్వాన పత్రికను ముద్రించి అభిమానులను పంపించారు. ప్రస్తుతం ఈ వెరైటీ ఆహ్వాన పత్రిక నెట్టింట వైరల్ అవుతోంది.

పుట్టిన ప్రతీ ఒక్కరికీ మరణం తప్పదని, బతికి ఉన్నంత కాలం ఇతరులకు వీలైనంత సాయం చేయాలే తప్ప అపకారం చేయొద్దని రామారావు చెప్పారు. ఈ విషయం గుర్తెరిగి తాను ఎంతకాలం జీవించాలని అనుకుంటున్నాడో ఆలోచించి, మరణానికి ఓ తేదీని నిర్ణయించుకుని ఏటా రణదిన వేడుకలు జరుపుకోవాలని సూచించారు. భగవంతుడు ఎంత బోధించినా మనిషి తన జీవన విధానాన్ని, ఆలోచనను పూర్తిగా సరిచేసుకోవడంలేదని అన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version