దిశా హత్య కేసు నిందితుల విషయంలో తెలంగాణా పోలీసులు అనుసరించిన వ్యవహారశైలిపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమైన సంగతి తెలిసిందే. వారిని కాల్చి చంపడం సరైనదే అని కొందరు అంటే మరి కొందరు అసలు అది సరైన విధానం కాదని అవసరమైతే చట్టాల వారీగా వెళ్ళాలి, వాటిని మార్చుకోవాలి గాని ఇష్టం వచ్చినట్టు వ్యవహరించడం అనేది సరైన విధానం కాదని పలువురు అభిప్రాయపడ్డారు.
ఈ నేపధ్యంలో తాజాగా ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ సంచలన ట్వీట్లు చేశారు. సీపీ సజ్జనార్‌ను ఉద్దేశించి ట్వీట్ చేసిన ఆయన, ఉదయం 5 గంటలకు ఎన్ కౌంటర్లు చేయడం దారుణమని, బుల్లెట్లు కడుపులో దించడం కాదని పేర్కొన్నారు. అవసరమైతే అరెస్ట్ చేసి థర్డ్ డిగ్రీ కూడా చేసుకోవచ్చన్నారు. టెర్రరిజానికి మతం లేదని అభిప్రాయపడ్డారు. దీనికి స్పందిస్తూ సీపీ సజ్జనార్ మరో ట్వీట్ చేశారు.
దానిపై పనిచేస్తున్నామని, డేటాను కలెక్ట్ చేస్తున్నామని, 24బై 7 తమ టీం పనిచేస్తుందన్నారు, ఉగ్రవాదం సమాచారం సేకరించేందుకు మా వద్ద వ్యవస్థ ఉందని తెలిపారు. దీనిపై స్పందించిన ఒవైసీ సైబరాబాద్‌లో ఎంతమంది జిహాదీలు ఉన్నారంటూ ప్రవ్నించారు. వాళ్ల సమాచారం మీ వద్ద ఉందా ఏ కంపెనీలో జిహాదీలు పనిచేస్తున్నారు ? అంటూ ఓవైసీ ట్వీట్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
@cpcybd sir whatever you do but no killings in name of "encounter" at 05am please, if possible arrest & as accepted 3rd degree will be given but pls no cartoos in stomach
CP saheb Terrorism has no religion, (remember NGodse) https://t.co/uEMhF7Or2v— Asaduddin Owaisi (@asadowaisi) January 8, 2020