వైరల్ వీడియో; ఈ బాతుని చూసి మనుషులు చాలా నేర్చుకోవచ్చు…!

-

సృష్టిలో ఎన్నో అద్భుతాలు జరుగుతూ ఉంటాయి. సోషల్ మీడియా పుణ్యమా అని మనం కొన్ని ఆశ్చర్యకర వీడియోలు చూస్తూ ఉంటాం. కుక్కతో కోతి స్నేహం చేయడం, చిరుత పులి జింకను కాపాడే వీడియోలు ఇలా సోషల్ మీడియాలో ఎక్కువగా వైరల్ అవుతూ ఉంటాయి. తాజాగా ఒక వీడియో సోషల్ మీడియాలో ఇదే విధంగా వైరల్ అవుతుంది. సృష్టి ఎంత అద్భుతమైందో చెప్తుంది ఈ వీడియో.

చెరువులో చేపలకు ఒక బాతు ధాన్యం తినిపించే వీడియో ఒకటి సోషల్ మీడియాలో వేగంగా వైరల్ అవుతుంది. భారతీయ అటవీ సేవా అధికారి పర్వీన్ కస్వాన్ 32 సెకన్ల క్లిప్‌ను ట్విట్టర్‌లో షేర్ చేసారు. ధాన్యం నిండిన ట్రేలు ఒక చెరువు పక్కన ఉంచగా ఒక బాతు దాని ముక్కుతో కొంచెం కొంచెం తీసుకుని చెరువులో ఈదుతున్న చేపలకు తినిపిస్తుంది. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ గా మారింది.

“స్నేహానికి మంచి ఉదాహరణ నాకు కనపడింది. ఈ చేపలకు ఒక మంచి స్నేహితుడు వచ్చాడు” అని పర్వీన్ కస్వాన్ వీడియో షేర్ చేస్తూ వ్యాఖ్యానించారు. ఈ వీడియో లక్షల కొద్దీ వ్యూస్ సాధించింది. “ఇది స్నేహం యొక్క స్వచ్ఛమైన రూపం.” “మానవులు జంతువులు మరియు పక్షుల నుండి చాలా నేర్చుకోవచ్చు” అని సోషల్ మీడియాలో వ్యాఖ్యానించారు. నేను చూసిన బెస్ట్ వీడియో అంటూ కొందరు కామెంట్ చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version