సిడ్నీ వేదికగా న్యూజిలాండ్‌తో జరిగిన మూడో, ఆఖరి టెస్టులో ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌లో 454 పరుగుల వద్ద ఆల్ అవుట్ అయింది. రెండవ రోజు న్యూజిలాండ్ బౌలర్లు కట్టడి చేయడంతో ఆసిస్ భారి స్కోర్ సాధించలేకపోయింది. ఇక ఆసిస్ ఆటగాళ్ళలో మార్నస్ లాబుస్చాగ్నే తన తొలి డబుల్ టెస్ట్ సెంచరీని సాధించాడు. న్యూజిలాండ్ 2 వ రోజు వికెట్ కోల్పోకుండా ఆట ముగిసే సమయానికి 63 పరుగులు చేసింది.
391 పరుగుల తేడాతో మొదటి ఇన్నింగ్స్ లో కివీస్ వెనుకబడి ఉంది. టామ్ లాథమ్ (26 నాటౌట్), టామ్ బ్లుండెల్ (34 నాటౌట్) క్రీజ్ లో ఉన్నారు. ఇక ఇదిలా ఉంటే ఈ మ్యాచ్ లో ఒక అవుట్ అభిమానులను విశేషంగా ఆకట్టుకుంది. ఆసిస్ ఆటగాడు జేమ్స్ ప్యాటిన్సన్ అవుట్ అయిన తీరు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. బహుశా క్రికెట్ లో అదేనేమో అత్యంత దురదృష్టకరమైన అవుట్.
నీల్ వాగ్నెర్ విసిరిన బంతిని డిఫెన్స్ ఆడే క్రమంలో ఆ బంతి అతని భుజంపై నుంచి చేతి మీద పడి ఆ తర్వాత బ్యాట్ మీద పడి అది స్టంప్స్ ని గిరాటేసింది. దీనికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇలాంటి అవుట్ ని అతను ఊహించలేదేమో అంటూ పలువురు కామెంట్ చేస్తున్నారు. మరికొందరు అయితే దరిద్రం అంటే ఇదేనేమో అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.
You've got to be kidding! James Pattinson can't believe his luck! ?@bet365_aus | #AUSvNZ pic.twitter.com/hSJIeCWdd9
— cricket.com.au (@cricketcomau) January 4, 2020