తెలంగాణ మంత్రి పువ్వాడకు అవ‌మానం.. ఏం జ‌రిగిందంటే..?

-

తెలంగాణ భవన్‌లో మంత్రి పువ్వాడ అజయ్‌ కుమార్‌కు అవమానం జరిగింది. సాక్షాత్తు హైదరాబాదులోని తెలంగాణ భవన్ లో ఇది ఎదురుకావడం గమనార్హం. వివరాల్లోకి వెళ్తే, తెలంగాణ భవన్ లో ఈరోజు టీఆర్ఎస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశం జరిగింది. ఈ సమావేశంలో మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి నేతలకు ముఖ్యమంత్రి కేసీఆర్ దిశానిర్దేశం చేశారు.

ఈ సమావేశానికి హాజరుకావడానికి పువ్వాడ వస్తుండగా… ఆయనను ఆపిన పోలీసులు తనిఖీ చేశారు. పోలసు చర్యతో ఆయన తీవ్ర అసహనానికి గురయ్యారు. మంత్రిని అని చూడకుండా తనిఖీ చేస్తారా? అని మండిపడ్డారు. జరిగిన ఘటనపై ముఖ్యమంత్రి కేసీఆర్ కు ఫిర్యాదు చేస్తానని హెచ్చరించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version