టీమ్ ఇండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ ఓ క్రికెటర్ అద్భుత ప్రదర్శకు ఫిదా అయ్యాడు. అతడి ప్రదర్శనను కొనియాడుతూ ఓ సూపర్ గిఫ్ట్ ఇచ్చాడు. ఇంతకీ ఎవరా ఆటగాడు. అతనికి కోహ్లీ ఇచ్చిన గిఫ్ట్ ఏంటి..?
T20 ప్రపంచకప్‌లో భాగంగా నవంబర్ 3న బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో 5 పరుగుల తేడాతో టీమ్ ఇండియా విజయం సాధించింది. బంగ్లాదేశ్ ఓపెనర్ లిటన్ దాస్ ఆడిన ఇన్నింగ్స్ మాత్రం మ్యాచ్ మొత్తానికే హైలైట్‌గా నిలిచింది. ఈ మ్యాచ్‌లో దాస్.. భారత బౌలర్లను దాస్ బెంబేలెత్తించాడు. 27 బంతుల్లో 7 ఫోర్లు, మూడు సిక్స్‌లతో 60 పరుగులు చేశాడు. కేవలం 21 బంతుల్లోనే దాస్ హాఫ్ సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు.
ఈ అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడిన లిటన్ దాస్‌కు భారత స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ ఫిదా అయ్యాడు. అతడిని అభినందిస్తూ తన బ్యాట్‌ను బహుమతిగా ఇచ్చాడు. ఈ విషయాన్ని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (బీసీబీ) క్రికెట్ ఆపరేషన్స్ చైర్మన్ జలాల్ యూనస్ వెల్లడించారు. “మేము డైనింగ్ హాల్‌లో ఉన్నప్పుడు, విరాట్ కోహ్లీ వచ్చి లిటన్‌కు తన బ్యాట్‌ను బహుమతిగా ఇచ్చాడు. ఇది నిజంగా లిటన్‌కు మధురమైన క్షణం” అని జలాల్ యూనస్ పేర్కొన్నారు.