ఆదివారం రోజున ఇండియా వర్సెస్ జింబాబ్వే దేశాల మధ్య మ్యాచ్ జరుగనున్న సంగతి తెలిసిందే. అయితే ఈ మ్యాచ్ లో టీమిండియాను జింబాబ్వే ఓడిస్తే ఆ దేశపు వ్యక్తిని పెళ్లి చేసుకుంటానని ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చింది పాకిస్తాన్ నటి. దీంతో ఒక్కసారిగా అమ్మడు కామెంట్స్ వైరల్ గా మారాయి.
పాకిస్తాన్ నటి అయినా షేహార్ షిన్వారి ట్విట్టర్ వేదికగా ఈ ప్రకటన చేసింది. “త్వరలో జరగబోతున్న ఐసీసీ మెన్స్ టి20 వరల్డ్ కప్ లో, జింబాబ్వే కానీ ఇండియాను చిత్తుగా ఓడిస్తే ఖచ్చితంగా నేను ఆ దేశపు వ్యక్తిని పెళ్లి చేసుకుంటానని” ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చింది. దీంతో ఇండియన్స్ ఫుల్ ఫైర్ అవుతున్నారు. అంతేకాదు పాకిస్తాన్ ఇలాంటి చీప్ ట్రిక్స్ కూడా ప్లే చేస్తుందా అంటూ మండిపడుతున్నారు.