ప్రేమించిన అమ్మాయిని త్వరలోనే పరిచయం చేస్తా అంటున్న విశాల్..!

-

కోలీవుడ్ హీరో విశాల్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. తెలుగు ప్రేక్షకులకు కూడా బాగా సుపరిచితుడే .. హీరోగా, నిర్మాతగా ప్రస్తుతం కెరియర్ లో బిజీగా ఉన్న విశాల్ ఇండస్ట్రీలో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ హీరోలలో ఈయన కూడా ఒకరు. నాలుగు పదుల వయసు వచ్చినా కూడా ఇంకా పెళ్లి ఆలోచన చేయని విశాల్ గతంలో ఒక అమ్మాయితో నిశ్చితార్థం చేసుకున్నాడు. కొన్ని కారణాలవల్ల ఎంగేజ్మెంట్ బ్రేక్ అయింది. ఆ తర్వాత వరలక్ష్మి శరత్ కుమార్ తో ప్రేమాయణం నడిపాడు కానీ శరత్ కుమార్ తో గొడవలు రావడంతో వరలక్ష్మీ శరత్ కుమార్ తో ప్రేమాయణం కూడా బ్రేక్ అయింది. కానీ ఇదే విషయం అడిగితే కాదు స్నేహితులం మాత్రమే అని కప్పిపుచ్చే ప్రయత్నం చేశారు.

ప్రస్తుతం నటుడిగా నిర్మాతగా కొనసాగుతున్న విశాల్ నడిగర్ సంఘం ప్రధాన కార్యదర్శిగా కూడా కొనసాగుతున్నారు. సేవా కార్యక్రమాలు చేయడంలో ముందుండే ఈయన వరదలు, ప్రకృతి విపత్తులు వంటి వచ్చిన వేళ తనకు చేతనైన సహాయం చేసి మంచి మనసు చాటుకున్నాడు. అంతేకాదు ఇటీవల ఒక చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో 11 మంది పేద జంటలకు తాళిబొట్టు తో సహా ఇళ్లకు అవసరమైన వస్తువులను అందించి, తన సొంత ఖర్చుతో వారికి వివాహం జరిపించారు. ఇక ప్రస్తుతం ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న విశాల్ తన పెళ్లి గురించి కూడా ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

తనకు పెద్దలు కుదిర్చిన వివాహం సెట్ కాదని, అందుకే ప్రేమ వివాహమే చేసుకుంటానని తెలిపాడు. త్వరలోనే ఆ అమ్మాయిని అందరికీ పరిచయం చేస్తాను.. ఆ అమ్మాయి తోనే ఏడు అడుగులు వేస్తాను.. అంటూ విశాల్ చెప్పడంతో ప్రతి ఒక్కరు అమ్మాయి ఎవరు? ఎప్పుడు బయటపెడతారు ? ఈసారైనా పెళ్లి వరకు వెళ్తారా ? అంటూ రకరకాల కామెంట్లు చేస్తున్నారు. మరి విశాల్ తాను ప్రేమించిన అమ్మాయిని పరిచయం చేసే వరకు ఎదురు చూడక తప్పదు.

Read more RELATED
Recommended to you

Exit mobile version