షాకింగ్‌: అత్యంత కాలుష్య నగరాల జాబితాలో హైదరాబాద్‌, విశాఖ

-

రోజు రోజుకు కాలుష్య కోరల్లో దేశంలోని రాష్ట్రాలు చిక్కుకుంటున్నాయి. తాజాగా కేంద్ర విడుదల చేసిన కాలుష్య నగరాల జాబితాల లిస్ట్‌లోకి హైదరాబాద్‌, విశాఖపట్నం పట్టణాలు సైతం చేరిపోయాయి. తాజాగా కేంద్రం విడుదల చేసిన దేశంలోనే అత్యంత కాలుష్య నగరాల్లో విశాఖపట్నం, హైదరాబాద్‌ చేరాయి. కేంద్ర కాలుష్య నియంత్రణ బోర్డు (సీపీసీబీ) మంగళవారం విడుదల చేసిన అత్యంత కాలుష్య నగరాల జాబితాలో బిహార్‌లోని కతిహర్‌ అగ్రస్థానంలో నిలిచింది. కతిహర్‌ నగరంలో గాలి నాణ్యత (ఏక్యూఐ) 360 పాయింట్లకు పడిపోయిందని సీపీసీబీ తన నివేదికలో పేర్కొంది. ఢిల్లీ (354 పాయింట్లు), నోయిడా (328), ఘజియాబాద్‌ (304) నగరాలు ఆ తర్వాతి స్థానాల్లో నిలిచాయి.

వీటితోపాటు బిహార్‌లోని బెగుసరాయ్‌, హరియాణాలోని బల్లాబ్‌గఢ్‌, ఫరిదాబాద్‌, కైతాల్‌, గురుగ్రామ్‌, మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌లను కూడా కాలుష్య నగరాలుగా సీపీసీబీ నిర్ధారించింది. అలాగే తెలుగు రాష్ట్రాల్లో విశాఖపట్టణం (202 పా యింట్లు)లో గాలి నాణ్యత తక్కువగా ఉన్నట్లు నివేదిక పేర్కొంది. అనంతపురం (145), హైదరాబాద్‌ (100), తిరుపతి (95), ఏలూరు (61) కూడా ఈ జాబితాలో ఉన్నాయి. పం జాబ్‌, హరియాణాల్లో పంట పొలాల వ్యర్థాలను తగులబెట్టడం, వాహనాల నుంచి విడుదలయ్యే కర్బన ఉద్గారాల కారణంగా దేశ రాజధాని ప్రాంతంలో కాలుష్యం రోజురోజుకూ పెరిగిపోతోందని సీపీసీబీ పేర్కొంది. కాలుష్య నియంత్రణకు ప్రభుత్వ యంత్రాంగాలుచర్యలు చేపడుతున్నప్పటికీ, దేశంలో పలు నగరాల్లో గాలి నాణ్యత పడిపోవడం ఆందోళన కలిగిస్తోంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version