Vishnu Priya : యాంకర్ విష్ణుప్రియ ఇంట తీవ్ర విషాదం..

-

టాలీవుడ్‌ యాంకర్‌ విష్ణు ప్రియ ఇంట తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఆమె తల్లి కాలం చేశారు. గురువారం ఆమె తల్లి తుది శ్వాస విడిచినట్లు విష్ణు నే తన ఇన్ స్టాగ్రామ్ ఖాతా ద్వారా వెల్లడించింది. తన తల్లితో కలిసి ఉన్న ఫోటో షేర్ చేస్తూ ఎమోషనల్ అయ్యింది.

తన పోస్టులో మై డియర్ అమ్మ ఈరోజు వరకు నాకు తోడుగా ఉన్నందుకు నీకు ధన్యవాదాలు. నా చివరి శ్వాస వరకు నీ పేరు నిలబెట్టేందుకు కృషి చేస్తాను. నువ్వు నా బలం, నువ్వే నా బలహీనత. ప్రస్తుతం నువ్వు ఈ అనంత విశ్వంలో కలిసిపోయావు. నువ్వు ప్రతిచోట, నా ప్రతి శ్వాసలో ఉంటావని నాకు తెలుసు. ఈ భూమి మీద నాకు ఒక మంచి జీవితాన్ని ఇవ్వడానికి నువ్వు ఎన్ని కష్టాలు పడ్డావో నాకు తెలుసు. అందుకు నేను నీకు జీవితాంతం రుణపడి ఉంటాను. రెస్టిన్ పీస్ అమ్మ అంటూ విష్ణుప్రియ పోస్ట్ ను షేర్ చేసుకుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version