ఇండస్ట్రీ లో మరో విషాదం.. మారి 2 నటుడు మృతి..!

-

తాజాగా సినీ ఇండస్ట్రీలో వరుస మరణాలు విషాదాన్ని నింపుతున్నాయి. తాజాగా సీనియర్ నటి జమున తన స్వగృహంలో వయోధిక భారంతో 86 సంవత్సరాల వయసులో ఆమె మరణించింది. అయితే ఆమె మరణాన్ని ఇంకా మరువకముందే ఇప్పుడు మరో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ సినీ నటుడు దర్శకుడు ఇ. రామదాసు గుండెపోటుతో మృతి చెందినట్లు ఈరోజు నిర్ధారించారు. ఇ.రామదాస్ 66 సంవత్సరాల వయసులో గుండెపోటుతో మరణించడం విషాదకరం. ఈ వార్తలు ఆయన కొడుకు కల్చెల్వన్ సోషల్ మీడియాలో ధ్రువీకరించారు. ఈయన మృతి పట్ల పలువురు సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు.

కల్చెల్వన్ సోషల్ మీడియా ద్వారా..” మా నాన్న దర్శకుడు, రచయిత, నటుడు, ఇ. రామ్ దాస్ గుండెపోటుతో మరణించారు. ఆయన అంత్యక్రియలు 24 -1- 2023 ఉదయం 11 గంటలకు స్వగృహంలో జరిగాయి అయితే ఈ విషయాన్ని తెలియజేయడం చాలా విచారకరం” అంటూ రాసుకు వచ్చారు. ఇకపోతే పలు హిట్ చిత్రాలలో ఈయన నటించారు. కోలీవుడ్ లో 1986లో అయర్ పూకే మలరట్టుం సినిమాతో దర్శకుడిగా పరిచయం అయ్యారు. వీటితోపాటు మరెన్నో చిత్రాలలో నటించిన ఈయన మారి 2 సినిమాలో కూడా నటించారు.

తమిళంలో 9 మంది దర్శకులు కలిసి 24 గంటలలో తీసిన ఒక చిత్రంలో గిన్నిస్ రికార్డును సృష్టించారు.. అందులో రామదాసు కూడా ఒకరు. స్క్రీన్ రైటర్ గా సత్తా చాటారు 1986లో ఆయార్ పూకే మలరట్టుం అనే చిత్రం ద్వారా డైరెక్టర్ గా పరిచయమయ్యారు. ఆ తర్వాత ఎన్నో చిత్రాలలో నటించారు ఈయన. రామదాస్ రచయితగా కూడా పలు సినిమాలలో పనిచేశారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version