ఆ హీరోతో గుత్తా జ్వాల ల‌వ్వాయ‌ణం..!

-

ప్ర‌ముఖ బాడ్మింటన్ గుత్తా జ్వాల తాజాగా సెప్టెంబ‌ర్ 7న పుట్టిన రోజు జ‌రుపుకుంది. అయితే ఈమె ప్రేమాయాణంపై ఎన్నో క‌థ‌నాలే వ‌చ్చాయి. కోలీవుడ్ నటుడు విష్ణు విశాల్‌తో డేటింగ్‌లో ఉంద‌ని చాలా రూమ‌ర్లు వ‌చ్చాయి. విష్ణు విశాల్ డిమోంటీ కాలనీ, రాక్షసన్ చిత్రాల కథానాయకుడు. హీరో విష్ణు విశాల్ జ్వాల గుత్తా బ‌ర్త్‌డే సంద‌ర్భంగా చెన్నై నుంచి హైదరాబాద్ వచ్చాడు. ఏడాది కాలంగా వీరిపై డేటింగ్ రూమర్లు వస్తున్నా వాటిపై మాత్రం రియాక్ట్‌ అవ్వ‌లేదు.

Vishnu Vishal celebrates girlfriend Jwala Gutta’s birthday in Hyderabad

బ్యాడ్మింటన్ ప్లేయర్ జ్వాలా గుత్తాతో తనకున్న సంబంధం గురించి ఈ నటుడు మళ్ళీ వార్తల్లో నిలిచాడు. విశాల్ గుత్తా జ్వాల బ‌ర్త్‌డేకి ఓ స్పెషల్ రింగ్‌ని బహుమతిగా ఇవ్వడంతో స్పెష‌ల్ ఎట్రాక్ష‌నై రూమ‌ర్ల‌కు ఊత‌మి ఇచ్చింది. విష్ణు విశాల్ కొన్ని నెలల క్రితం తన మాజీ భార్య రజిని న‌ట‌రాజ‌న్‌తో విడాకులు తీసుకున్నాడు. ప్ర‌స్తుతం జెర్సీ తమిళ రీమేక్ లో విష్ణు విశాల్ హీరోగా నటిస్తున్నారు. హీరో రానా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

బర్త్ డే పార్టీకి సంబంధించిన ఫొటోలని ట్విట్టర్ ద్వారా విశాల్ అభిమానులతో పంచుకున్నాడు. ఈ వీకెండ్ హైదరాబాద్‌లో బ‌ర్త్ డే గర్ల్ గుత్తా జ్వాలా ఇతర ఫ్రెండ్స్ తో ఎంజాయ్ చేశామ‌ని ట్వీట్ చేశాడు. దీంతో ఇద్దరి మధ్య ల‌వ్వాయ‌ణం నడుస్తోందన్న క‌థ‌నాల‌కు మరింత బలం చేకూరింది. అటు ఫ్యాన్స్‌లోనూ ఇదే చ‌ర్చ నడుస్తోంది. ఇక గుత్తా ఇది వ‌ర‌కే త‌న స‌హ ఆట‌గాడు చేత‌న్ ఆనంద్‌ను పెళ్లి చేసుకున్న కొద్ది రోజుల‌కే మ‌న‌స్ప‌ర్థ‌లు రావ‌డంతో విడాకులు తీసుకున్న సంగ‌తి తెలిసిందే.

Read more RELATED
Recommended to you

Exit mobile version