బడ్జెట్ బుక్ కలర్ ఎక్కువగా కంటెంట్ తక్కువగా ఉంది : బుగ్గన

-

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది కావొస్తుంది. ఇప్పటికీ కూడా గత ప్రభుత్వం మీదే ఎందుకు మాట్లాడుతున్నారు అని వైసీపీ మాజీమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి అన్నారు. బడ్జెట్ ప్రసంగంలో 25 సార్లు గత ప్రభుత్వం అని.. 10 సార్లు విధ్వంసం అని మాట్లాడారు. ఉన్నది ఒక్కటే ప్రతిపక్ష పార్టీ.. మాకు ప్రతిపక్ష హోదా ఇవ్వం అన్నారు. మీరు సుపరిపాలన చేయాలి కదా.. ఇంటింటికీ తిరిగి సూపర్ సిక్స్ అన్నారు. ఒకటికి పది సార్లు ఇంటి చుట్టూ తిరిగి తిరిగి ఒక్కో ఇంటికి లక్షలు వస్తాయి అని చెప్పారు.

జగన్ ప్రభుత్వంలో పథకాలు కచ్చితంగా అందరికీ అందాయి. అలాగే అందుతాయని నమ్మి మోసపోయి ఉండవచ్చు. వాళ్ళు చెప్పారు.. విని మోసపోయారు. సూపర్ సిక్స్ లో ఇప్పటి వరకు అందింది అర్ధ దీపమో.. పావు దీపమో వాళ్లే చెప్పాలి. చంద్రబాబు ఎప్పుడు అధికారంలోకి వచ్చినా జీతాలు సరిగ్గా రావు. చంద్రబాబును ఓ చాణక్యుడు, కౌటిల్యుడు అని పోల్చారు.. మరి నాకు తెలిసి ఆయనకు ఏదీ సూట్ కాదు. ఈయనకు వైనమైన లెక్కలు రావు. ఈసారి బడ్జెట్ కూడా సిస్టమాటిక్ గా పొందుపరచలేదు. బడ్జెట్ బుక్ కలర్ ఎక్కువగా కంటెంట్ తక్కువగా ఉంది అని బుగ్గన పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version