మూడు నెలలుగా జర్మనీలో చిక్కుకుపోయి గత శనివారం భారత్కు చేరుకున్న చెస్ దిగ్గజం విశ్వనాథన్ ఆనంద్ ఎట్టకేలకు కుటుంబ సభ్యులను కలుసుకున్నాడు. కేంద్ర ప్రభుత్వం సాయంతో గత నెల 30న బెంగళూరులో అడుగుపెట్టిన ఆనంద్.. వారం రోజుల క్వారంటైన్ అనంతరం శనివారం ఇంటికి చేరుకున్నాడు. ఈ సందర్బంగా ‘112 రోజుల తర్వాత ఎట్టకేలకు ఇంటికి చేరా.. కుటుంబసభ్యులను కలవడం చాలా ఆనందంగా ఉంది’ అని ఆనంద్ పేర్కొన్నాడు.