వివో నుంచి కొత్త ఫోన్.. ఇండోనేషియాలో లాంచ్ అయింది. అదే Vivo Y35.. ప్రస్తుతం ఒక్క వేరియంట్‌లోనే ఫోన్ లాంచ్ అయింది. దీని ధర కూడా ఎక్కువగానే ఉంది. 50 మెగాపిక్సెల్‌లో లాంచ్ అయిన ఈ ఫోన్ ఫీచర్స్ ఎలా ఉన్నాయంటే..!!
వివో వై35 ధర..
ఇందులో కేవలం ఒక్క వేరియంట్ మాత్రమే అందుబాటులో ఉంది. 8 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్‌తో వచ్చిన ఈ వేరియంట్ ధరను 33,99,000 ఇండోనేషియా రూపాయలుగా అంటే సుమారు రూ.18,500గా ఉంది. గోల్డ్, బ్లాక్ రంగుల్లో ఈ ఫోన్ కొనుగోలు చేయవచ్చు.
వివో వై35 స్పెసిఫికేషన్లు
ఈ స్మార్ట్ ఫోన్‌లో 6.58 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ డిస్‌ప్లేను అందించారు.
దీని స్క్రీన్ రిజల్యూషన్ 1080 × 2408 పిక్సెల్స్‌గా ఉంది. దీని స్క్రీన్ రిఫ్రెష్ రేట్ 90 హెర్ట్జ్‌గా ఉంది.
ఎన్టీఎస్సీ కలర్ గాముట్ కూడా ఇది సపోర్ట్ చేయనుంది.
క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్ 680 ప్రాసెసర్‌పై ఈ ఫోన్ పనిచేయనుంది.
8 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ అందించారు. స్టోరేజ్‌ను మైక్రో ఎస్‌డీ కార్డు ద్వారా 1 టీబీ వరకు పెంచుకోవచ్చు.
ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ను ఫోన్ పక్కభాగంలో అందించారు.
ఫేస్ అన్‌లాక్ ఫీచర్ కూడా ఉంది. డ్యూయల్ సిమ్, 4జీ, డ్యూయల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 5, జీపీఎస్, బైదు, గ్లోనాస్ వంటి కనెక్టివిటీ ఫీచర్లు అందించారు.
దీని మందం 0.82 సెంటీమీటర్లు కాగా, బరువు 188 గ్రాములుగా ఉంది.
ఇక కెమెరాల విషయానికి వస్తే…
ఫోన్ వెనకవైపు మూడు కెమెరాలు ఉన్నాయి. వీటిలో ప్రధాన కెమెరా సామర్థ్యం 50 మెగాపిక్సెల్‌గా ఉంది. దీంతోపాటు 2 మెగాపిక్సెల్ బొకే సెన్సార్, 2 మెగాపిక్సెల్ మాక్రో సెన్సార్ కూడా అందించారు. ఇక సెల్పీలు, వీడియో కాల్స్ కోసం ముందువైపు 16 మెగాపిక్సెల్ కెమెరా ఉంది.
త్వరలోనే ఈ ఫోన్ ఇండియాలో కూడా లాంచ్ అయ్యే అవకాశం ఉంది. ఇప్పటికీ వివో నుంచి వరుసగా ఫోన్లు లాంచ్ అవుతున్నాయి. వివో వీ25 ప్రో స్మార్ట్ ఫోన్ ఇటీవలే మనదేశంలో విడుదల అయింది.