మరో నాలుగైదు రోజుల్లో విడుదల కావాల్సి ఉన్న చిన్నమ్మ శశికళ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఆమె కరోనా బారిన పడినట్టు సమాచారం. బెంగళూరులోని పరప్పన అగ్రహార జైలులో ఉన్న శశికళ బుధవారం నాడు తీవ్ర అస్వస్థతకు గురి కావడంతో అధికారులు ఆమెను ఆసుపత్రిలో చేర్చారు. తీవ్రమైన జ్వరం, వెన్ను నొప్పి, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు ఏర్పడడంతో ఆమెకు కరోనా పరీక్షలు నిర్వహించడంతో అందులో కరోనా పాజిటివ్ అని తేలింది.
అయితే ఆమె ఆరోగ్యం బాగా లేకపోవడంతో ఆమె ఐసీయూలో ఉంచి చికిత్స అందిస్తున్నారు. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో సుమారు నాలుగు సంవత్సరాల పాటు జైలుశిక్ష అనుభవించిన శశి కళ ఈ నెల 27వ తేదీన విడుదల కావలసి ఉంది. ఈ సమయంలో ఆమె అస్వస్తతకు గురికావడంతో తమిళనాడు రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. నిజానికి ఆమె రాష్ట్రంలోకి వచ్చేటప్పుడు 1000 వాహనాలతో పెద్ద ఎత్తున స్వాగతం పలికి తీసుకురావాలని ఆమె వర్గీయులు భావించారు. ఇంతలోనే ఆమె అనారోగ్యం పాలుకావడం వాళ్ళందరిని టెన్షన్ పెడుతోంది.