ఈ మధ్య కాలంలో యువత వెరైటీగా ఉన్న వాటిని ఇష్ట పడుతున్నారు. అందుకే కొత్తగా వ్యాపారం లోకి దిగుతున్న వారు యువతను ఎట్రాక్ట్ చేయడానికి రకరకాల పేర్లు పెడుతున్నారు. తాజాగా తెలుగు రాష్ట్రాలలో ఒక రెస్టారెంట్ చర్చనీయాంశంగా మారింది. ఇంతకీ దాని పేరు ఏంటో తెలుసా ‘పొట్ట పెంచుదాం’. సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతున్న దానిని బట్టి ఈ రెస్టారెంట్ రాజమండ్రిలో కొత్తగా ఏర్పాటు చేశారట.
వినడానికి కాస్త ఆసక్తికరంగా ఉండటంతో ఈ విషయం ఆ నోటా ఈ నోటా పడి సోషల్ మీడియాకి ఎక్కి వైరల్ గా మారింది. గతంలో కూడా ఇలాంటి చాలా పేర్లు వైరల్ అయ్యాయి. తినేసి పో, ఉప్పు కారం, దిబ్బ రొట్టె, అద్భుతః, కోడి కూర చిట్టి గారే, దా తిను లాంటి పేర్లు వైరల్ అయ్యాయి. మామూలుగా బయట తిండి తినడం ద్వారా పొట్ట పెరుగుతుందని ఇళ్లలో వాళ్ళు అలా బయట తినవద్దని సలహాలు ఇస్తూ ఉంటారు, ఇప్పుడు ఏకంగా ఒక రెస్టారెంట్ ఆ పేరుతో ఏర్పాటు కావడం అసక్తికరంగా మారింది.