ఆస్ట్రేలియా కొత్త కెప్టెన్ గా మాథ్యూ వేడ్!

-

ఆస్ట్రేలియా కొత్త కెప్టెన్ గా మాథ్యూ వేడ్ ఎంపిక కానున్నాడు. టి20 ప్రపంచ కప్ 2022లో ఆస్ట్రేలియా బ్యాకప్ కెప్టెన్ గా వికెట్ కీపర్ మాథ్యూ వేడ్ ఎంపిక అయ్యే అవకాశం ఉంది. ఈ విషయాన్ని సిడ్ని మార్నింగ్ ఓ ప్రకటనలో పేర్కొంది. కాగా ఈ మెగా ఈవెంట్ లో రెగ్యులర్ కెప్టెన్ అరోన్ ఫించ్ గాయపడిన లేదా మరే ఇతర కారణాల వల్ల జట్టుకు దూరమైతే మాథ్యూ వేడ్ సారధ్య బాధ్యతలు చేపట్టనున్నాడు.

కాగా మాథ్యూ వేడ్ ప్రస్తుతం తన కెరీర్ లోనే అత్యున్నత ఫామ్ లో ఉన్నాడు. ఇటీవల టీమిండియా తో జరిగిన టి20 సిరీస్ లోను మాథ్యూ వేడ్ అద్భుతమైన ప్రదర్శన కనబరిచాడు. ఇక అంతకుముందు 2020 లో సిడ్నీ వేదికగా భారత్ తో జరిగిన ఓ టి20 మ్యాచ్ లో అసీస్ జట్టు కెప్టెన్ గా మాథ్యూ వేడ్ బాధ్యతలు నిర్వహించాడు. అదేవిధంగా దేశివాలి టోర్నీలో కెప్టెన్ గా బాధ్యతలు నిర్వహించిన అనుభవం కూడా ఉంది. మరోవైపు బిగ్ భాష్ లీగ్ లో హోబర్ట్ హరికేన్స్ సారథిగా మాథ్యూ వేడ్ కొనసాగుతున్నాడు.

Read more RELATED
Recommended to you

Exit mobile version