తిరుమల శ్రీవారి భక్తులకు మరో షాక్ తగిలింది. ఇవాళ అలాగే రేపు రెండు రోజులపాటు నడక దారులను మూసివేయాలని తిరుమల దేవస్థానం పాలకమండలి కీలక నిర్ణయం తీసుకుంది. తిరుమల అలాగే తిరుపతి పట్టణంలో ఇవాళ , రేపు రెండు రోజులపాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ స్పష్టం చేసింది.
ఈ నేపథ్యం లోనే నడక దారులు రెండు రోజులపాటు మూసివేయాలని టిటిడి పాలకమండలి కీలక నిర్ణయం తీసుకుంది. భక్తుల భద్రత దృశ్య ఇవాళ అలాగే రేపు రెండు రోజులపాటు ముందస్తుగా నడకదారులు మూసివేస్తున్నట్లు స్పష్టం చేసింది టిటిడి పాలక మండలి. శ్రీవారి దర్శనానికి వెళ్ళే భక్తులు బస్సు మార్గం గానే వెళ్లాలని సూచనలు చేసింది. తాము చెప్పిన విధంగా సూచనలు పాటిస్తూ శ్రీవారి భక్తులు దర్శనాలకు వెళ్లాలని ఇష్టం చేసింది టీటీడీ. కాగా గత వారం రోజుల కింద కూడా నడకదారులు మూసివేసింది టిటిడి పాలక మండలి.