హాలోవీన్ జరుపుకోవాలని ఉందా..? ఇండియా లో వుండే ఈ చోట్లకి వెళ్ళండి మరి..!

-

హాలోవీన్ ఫెస్టివల్ ని ఇంగ్లాండ్, ఐర్లాండ్, స్కాట్లాండ్, ఫ్రాన్స్ వంటి దేశాల్లో జరుపుకునే వారు. ఇది నిన్నో మొన్నో వచ్చినది కాదు. అనేక దశాబ్దాల క్రితమే ఈ హాలోవీన్ ఫెస్టివల్ వచ్చింది. ఈ పండుగను ఎందుకు చేసుకుంటారంటే.. సెల్ట్స్ జాతికి చెందిన ఓ తెగ చనిపోయిన తమ పూర్వీకులను రిమైండ్ చేసుకునే ఉద్ద్యేశ్యం తో విచిత్రమైన ఈ పండుగను చేయడం స్టార్ట్ చేసారు.

పైగా శీతాకాలంలో ఆత్మలు తిరుగుతాయట. అందుకని ఆ నమ్మకం వున్నవాళ్లు ఈ పండుగను జరిపేవారు. ఎక్కడో ఇంగ్లాండ్, ఐర్లాండ్, స్కాట్లాండ్, ఫ్రాన్స్ వంటి దేశాల నుండి ఇది మొదలై ఇప్పుడు ఇండియా లో చేస్తున్నారు. అయితే అందరు దీన్ని చెయ్యడం లేదు. అక్కడక్కడా చేస్తున్నారు. మీరు కూడా హాలోవీన్ ఫెస్టివల్ ని చేస్తున్నారా..? అయితే ఇండియా లో ఈ ప్రదేశాలకు వెళ్ళచ్చు. అక్టోబర్ 31న ఈ పండుగను ప్రతీ ఏటా చేస్తూ వుంటారు.

ఇండియా లో ఎక్కడ చేస్తుంటారు..?

ముంబయి, గోవా, బెంగళూరు, ఢిల్లీ, హైదరాబాద్ వంటి నగరాల్లో ఈ పండుగను సెలెబ్రేట్ చేస్తుంటారు. మంచిగా హాంటెడ్ ప్లేసెస్ కి వెళ్లి ఈ పండుగని సెలెబ్రేట్ చేసుకోవచ్చు.

డుమాస్ బీచ్:

గుజరాత్‌లోని డుమాస్ వుంది. డుమాస్ భారతదేశంలోని అత్యంత హాంటెడ్ ప్రదేశాలలో ఒకటి. ఇక్కడ ఈ ఫెస్టివల్ చేసుకోవడానికి పర్ఫెక్ట్ గా ఉంటుంది.

గోవా సాలియావో:

ఇది కూడా పర్ఫెక్ట్. ఈ ప్రాంతంలో రాత్రివేళ నిజంగా వింతగా ఉంటుందని అంటారు. ఈ ఫెస్టివల్ చేసుకోవాలంటే గోవా సాలియావో కి కూడా వెళ్ళచ్చు.

అస్సాం జాతిం:

ఇది కూడా హాంటెడ్ ప్రదేశాలలో ఒకటి. ఈ ఫెస్టివల్ చేసుకోవాలంటే ఇక్కడికైనా వెళ్ళచ్చు.

దిల్లీ:

కాంట్ రోడ్డులో ఓ దెయ్యం కనిపిస్తుంటుందని చాలా మంది అంటుంటారు. ఇలా మీరు ఈ ఫెస్టివల్ ని ఇక్కడ చేసుకుంటే చాలా బాగుంటుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version