పొగతాగడం మానేయాలనుకుంటున్నారా..అయితే నల్లమిరియాలను ఇలా వాడండి..!!

-

ధూమపానం, మద్యపానం ఆరోగ్యానికి మంచిది కాదని తాగే ప్రతి ఒక్కరికి తెలుసు.. కానీ ఒక్కసారి అలవాటు అయితే అందలోంచి బయటకు రావడం చాలా కష్టం.. ఒక అలవాటు వ్యసనం కానంతవరకే అది ఎంజాయ్‌ మెంట్‌ ఇస్తుంది. అయితే కొంతమంది ఈ అలవాటు నుంచి బయటపడాలనుకున్నప్పటికీ ఆటైంకు నోరు లాగేస్తుంది. మార్కెట్‌లో నోఎడిక్షన్‌ డ్రింక్‌, నోఎడిక్షన్‌ స్మోకింగ్‌ అంటూ… ఏవేవో ఉన్నాయి. ఇవి కాస్త ఖర్చుతో కూడుకున్నవి.. నాచురల్గా ధూమపానం నుంచి దూరం అవ్వాలనుకుంటే మిరియాలు మీకు బాగా ఉపయోగపడతాయి.

ఆహార రుచికే కాకుండా శరీరానికి, మనసుకు కూడా నల్ల మరియాలు ఎంతో మేలు. నల్ల మిరియాలలో యాంటీఆక్సిడెంట్లు, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలు అధికంగా ఉంటాయి. బరువు తగ్గడానికి, జలుబు, దగ్గు నుంచి ఉపశమనం పొందడానికి, రోగనిరోధక శక్తి, జీర్ణక్రియ మెరుగుదలకు నల్ల మిరియాలు ఎంతో ఉపయోగపడతాయి. కీళ్లనొప్పులు, మధుమేహం, క్యాన్సర్, అల్జీమర్స్ వంటి వ్యాధులను దూరం చేయడంలో మిరియాలు కీలకంగా వ్యవహరిస్తాయి.

ఆయుర్వేదంలో కూడా నల్ల మిరియాలను ఎన్నో సంవత్సరాలుగా ఉపయోగిస్తున్నారు. దీనిలోని ఔషధ గుణాలు పిల్లలు, పెద్దలు అందరికీ మేలు చేస్తాయి. ఆయుర్వేదంలో కూడా నల్ల మిరియాలను వేలాది సంవత్సరాలుగా ఉపయోగిస్తున్నారు. దీనిలోని ఔషధ గుణాలు పిల్లలు, పెద్దలు అందరికీ మేలు చేస్తాయి. కొలెస్ట్రాల్, మధుమేహం, రక్తపోటు నియంత్రణలో ఉండేలా చేస్తాయి.

నల్ల మిరియాలు స్మోకింగ్‌ అలవాటును మానివేయడానికి ఎంతో సహాయపడతాయి. నల్ల మిరియాల వాసన పీలిస్తే పొగతాగలన్న కోరిక ఉండదని అధ్యయనాల ద్వారా నిరూపించారు. ఇది క్యాన్సర్‌ను నివారించే లక్షణాలు కూడా దీనిలో ఉంటాయి.

తినే ఆహారం అరిగిపోవాలన్నా… మలబద్ధకం సమస్యలు రాకుండా ఉండాలన్నా… గ్యాస్ సమస్యలు పోవాలన్నా… మిరియాలు తినాలి లేదా పొడి రూపంలో వాడాలి. లేదా వంటల్లో అయినా వాడుకోవచ్చు. రక్తంలో షుగర్ లెవెల్స్ కరెక్టుగా ఉండేలా నల్ల మిరియాలు చేస్తాయి. రక్తంలో గ్లూకోజ్ వేగంగా చేరకుండా ఇది చూసుకుంటాయి.

మగవాళ్లలో టెస్టోస్టిరాన్ లెవెల్స్ పెంచి… సంతాన భాగ్యం కలిగేలా నల్ల మిరియాలు చేస్తాయి. వీటిలోని జింక్, మెగ్నీషియం సెక్స్ హార్మోన్లకు మేలు చేస్తాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version