అభిమానులే నా “గాడ్ ఫాథర్స్” – చిరంజీవి

-

మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన తాజా చిత్రం ” గాడ్ ఫాదర్”. “లూసిఫర్” కి రీమేక్ గా వస్తున్న ఈ చిత్రంలో చిరు రాజకీయ నాయకుడి పాత్రలో కనిపించనున్నాడు. ఈ చిత్రం ఇప్పటికే తెలుగులో డబ్ అయినప్పటికీ పలు మార్పులు చేసి.. ఈ చిత్రాన్ని తెలుగులో ప్రేక్షకులకు మళ్లీ అందిస్తున్నారు.

అయితే ఈ సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ నిన్న సాయంత్రం అనంతపురం జిల్లాలో జరిగిన సంగతి తెలిసిందే. ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ నేపథ్యంలో భారీ వర్షం కురిసింది. అయినప్పటికీ తగ్గేదే లే అంటూ మెగాస్టార్ చిరంజీవి తన ప్రసంగాన్ని కొనసాగించారు. ఈ నేపథ్యంలోనే భావోద్వేగమైన ప్రసంగాన్ని చిరంజీవి ఇచ్చారు.

ఈ సినిమాలో నేను చాలా గంభీరంగా కనిపిస్తాను… అది ఫాన్స్ కు బాగా నచ్చుతుంది అని చిరంజీవి తెలిపారు. తన ఫాన్సీ తనకు గాడ్ ఫాదర్స్ అంటూ చిరు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.ఈ రోజు ఉదయం సూపర్‌ స్టార్‌ కృష్ణగారి సతీమణి, మహేశ్‌బాబు తల్లి ఇందిరా దేవి మరణించారు. ఈ ‘గాడ్‌ ఫాదర్‌’ వేదికగా ఆ కుటుంబానికి సానుభూతి తెలియజేస్తున్నా. ఆ మహాతల్లి ఆత్మకు శాంతి చేకూరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా’ అని అన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version