మంచికి చెడుకు మధ్య వార్..అంచనాలు పెంచేసిన కిరణ్ అబ్బవరం ‘క’ మూవీ ట్రైలర్..

-

యంగ్ హీరో కిర‌ణ్ అబ్బ‌వ‌రం నటించిన కొత్త చిత్రం ‘క‌’మూవీ ట్రైలర్ విడుదలైంది. సుజీత్,సందీప్ డైరెక్షన్‌లో ఈ చిత్రం తెరకెక్కగా..చింతా వరలక్ష్మి సమర్పణలో శ్రీచక్రాస్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై చింతా గోపాలకృష్ణ రెడ్డి దీనికి ప్రొడ్యూస్ చేస్తున్నారు.న‌య‌న్ సారిక‌, త‌న్వి రామ్ క‌థానాయిక‌లుగా వ్యహరించారు. దీపావళి కానుకగా అక్టోబర్‌ 31న క‌ సినిమా విడుదల కానుంది.

ట్రైలర్ చూసేందుకు చాలా ఆసక్తిగా మూవీపై అంచనాలు పెంచేలా ఉంది. చుట్టూ కొండల మధ్య ఉన్న కృష్ణగిరి అనే అందమైన గ్రామంలో పోస్ట్ మ్యాన్‌గా హీరో పనిచేస్తుంటాడు.ఉత్తరాలు పంచే క్రమంలో 1979 ఏప్రిల్ 22న అభిషేక్ పేరుతో వచ్చిన ఉత్తరం వాసుదేవ్ (కిరణ్ అబ్బవరం) జీవితాన్ని మలుపు తిప్పుతుంది.ఆ ఉత్తరంలో ఏముందో చెప్పమంటూ.. ఓ ముసుగు వ్యక్తి హీరోను బెదిరిస్తాడు.వాస్తవానికి ఆ ఉత్తరంలో ఏముంది? ఆ ముసుగు వ్యక్తి, అతని గ్యాంగ్ హీరోను ఎందుకు వెంటాడుతారు? అనేది సస్పెన్స్. ఈ అంశాలు మూవీపై ఆసక్తిని మరింత పెంచాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version