ప్రీతిని లక్ష్యంగా చేసుకుని సైఫ్ వేధించాడు : సీపీ రంగనాథ్

-

వరంగల్ కాకతీయ మెడికల్ కళాశాల పీజీ వైద్య విద్యార్థిని ఆత్మహత్యాయత్నం ఘటనలో నిందితుడు సైఫ్​ గురించి సీపీ రంగనాథ్ ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు. ఈ కేసులో ఆస్పత్రి సూపరింటెండెంట్ చంద్రశేఖర్​ను కలిసి అన్ని వివరాలు తెలుసుకున్నానని చెప్పారు. నిందితుడు సైఫ్​ను అరెస్టు చేశామన్న సీపీ.. ప్రీతిని లక్ష్యంగా చేసుకుని సైఫ్​ వేధించాడని తెలిపారు.

‘అందరి ముందూ సైఫ్‌ అమ్మాయిని అవమానించాడు. ఏమైనా ఉంటే హెచ్‌వోడీకి ఫిర్యాదు చేయాలని ప్రీతి చెప్పింది. అవమానించడం కూడా ర్యాగింగ్‌లో భాగమే. ఇక్కడ కల్చర్‌ గురించి అందరితో మాట్లాడాను. ఇక్కడ సీనియర్‌ను జూనియర్లు సార్‌ అని పిలవాలనే కల్చర్‌ ఉంది. ప్రీతి చాలా తెలివైన, ధైర్యం ఉన్న అమ్మాయి. సైఫ్ ఆధిపత్యం చేసేందుకు ప్రయత్నించాడు. ప్రీతి ప్రశ్నించే తత్వం సైఫ్‌కు నచ్చలేదు. గ్రూపులో పోస్టు చేసి నన్ను అవమానపరిచావని సైఫ్‌తో ప్రీతి చెప్పింది. ఏదైనా ఉంటే హెచ్‌వోడీల దృష్టికి తీసుకురావాలని ప్రీతి చెప్పింది. సైఫ్‌ అనే వ్యక్తి నన్ను లక్ష్యంగా చేసుకుని వేధిస్తున్నాడని స్నేహితులకు చేసిన ఛాట్‌లో పేర్కొంది.’ అని సీపీ తెలిపారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version