వివేకా హత్య కేసుపై సజ్జల వివాదస్పద వ్యాఖ్యలు..చంద్రబాబు కాల్‌ లిస్ట్‌ తీయాలి !

-

వివేకా హత్య కేసుపై సజ్జల వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. ఈ కేసులో చంద్రబాబు కాల్‌ లిస్ట్‌ తీయాలన్నారు. అసలైన వారిని విచారణ చెయ్యకుండా.. అవినాష్, భాస్కర్ రెడ్డి ల చుట్టూ తిప్పుతున్నారు..కేసు ను జగన్ వైపు తిప్పాలని ప్రయత్నాలు చేస్తున్నారని ఫైర్‌ అయ్యారు. ఈ కుట్ర వెనుక చంద్రబాబు మాస్టర్ మైండ్ ఉందని ఆరోపణలు చేశారు.

సీబీఐ విచారణ జరుగుతున్న తీరుపై అనేక ప్రశ్నలు ఉన్నాయని.. వివేకా హత్య జరిగాక అనేక కథనాలు బయటకి వచ్చాయని తెలిపారు. హత్య జరిగినప్పుడు టీడీపీ ప్రభుత్వం అధికారంలో ఉందని.. వైసీపీ పెట్టినప్పుడు వివేకా మా పార్టీలో లేరు.. కాంగ్రెస్ లో ఉన్నారని వివరించారు. జగన్ కోరిక మేరకు వివేకా మా పార్టీలోకి వచ్చారు..మా పార్టీకి పెద్ద దిక్కుగా ఉన్నారు.. కొన్ని విషయాల్లో సలహాలు, సూచనలు తీసుకునే వాళ్ళమన్నారు. తండ్రిలానే అవినాష్ గెలుపు కోసం పనిచేశారు..Mlc ఎన్నికల్లో నూ నిలిపి గెలిపించడానికి ప్రయత్నం చేశామని వివరించారు. బిటెక్ రవి, అధినారాయన రెడ్డిలను.. ఎందుకు సీబీఐ విచారణ చెయ్యడం లేదని ఆగ్రహించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version